Karthika Deepam Serial: సాక్ష్యాలను మాయం చేసి.. కోర్టులో కార్తీక్.. దీపలకు చుక్కలు చూపించిన మోనిత..!

Karthika Deepam Serial: బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ 1148 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా మోనిత కోర్టుకు తీసుకువెళ్ళగా అక్కడ సౌందర్య దీప కార్తీక్ లను చూసి ఆగ్రహంతో రెచ్చిపోయి ఈ సంతోషం ఎంతసేపు పెద్ద చిచ్చు పెట్టబోతున్నాను అంటూ హెచ్చరించి కోర్టులోకి వెళుతుంది. కోర్టు లోపలికి వెళ్లగానే భగవద్గీత మీద ప్రమాణం చేయమనగా మోనిత నాకు వరాలు ఇవ్వకపోయినా నా దేవుడు కార్తీక్.. నా జీవితంలో […]

Written By: Kusuma Aggunna, Updated On : September 18, 2021 12:36 pm
Follow us on

Karthika Deepam Serial: బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ 1148 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా మోనిత కోర్టుకు తీసుకువెళ్ళగా అక్కడ సౌందర్య దీప కార్తీక్ లను చూసి ఆగ్రహంతో రెచ్చిపోయి ఈ సంతోషం ఎంతసేపు పెద్ద చిచ్చు పెట్టబోతున్నాను అంటూ హెచ్చరించి కోర్టులోకి వెళుతుంది. కోర్టు లోపలికి వెళ్లగానే భగవద్గీత మీద ప్రమాణం చేయమనగా మోనిత నాకు వరాలు ఇవ్వకపోయినా నా దేవుడు కార్తీక్.. నా జీవితంలో నాకు ఇద్దరే ఆత్మీయులు నా కార్తీక్ మా అక్క దీపక్క.. వంటలక్క పై ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అంటూ ప్రమాణం చేస్తుంది.

వాదన మొదలవగానే లాయర్ మీ పేరు అనగా…మోనిత కార్తీక్ అనే సమాధానం చెబుతుంది.. చూసారా యువరానర్ పెళ్లి కాకుండానే వేరొక భర్త పేరును తన పక్కన పెట్టుకుని తన జీవితంలోకి బలవంతంగా వెళ్లాలని చూస్తోందని అతను పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చనిపోయినట్లు డ్రామాలు ఆడి అతనిని జైలుకు పంపిందని, మారు వేషాలలో తిరుగుతూ అతనిని పెళ్లి చేసుకోవాలని బెదిరించి చివరకు దీప కంట పడటంతో జైలుకు లొంగిపోయిందని
మోనిత గురించి కోర్టులో వాదిస్తాడు. ఈ ముద్దాయి ఒక ఉన్మాది తన ప్రేమ కోసం ఎన్నో హత్యలు చేసింది కనుక ఈమెను కఠినంగా శిక్షించాలంటూ లాయర్ వాదిస్తాడు.

ఈ క్రమంలోనే జడ్జి మీ తరఫు న్యాయవాది ఉన్నారా అనగా… లేదు నా వాదనని నేనే వినిపించుకుంటాను అందుకు అనుమతి ఇవ్వండి అనగా న్యాయమూర్తి ప్రొసీడ్ అంటారు. అప్పటినుంచి నేను పెళ్లైన మగాడిని ప్రేమిస్తున్నాను అంటున్నారు కానీ.. నేను ప్రేమించే సమయానికి కార్తీక్ పెళ్లి కాలేదు. కనుక నేను ప్రేమించేటప్పుడే తను నా భర్త అని ఫిక్స్ అయిపోయాను ప్రేమించిన తర్వాత దీప తన జీవితంలోకి వచ్చింది అంటూ సమాధానం చెబుతుంది. ఈ క్రమంలోనే కార్తీక్ ప్రేమించిన అమ్మాయి తన ప్రేమకు అడ్డంగా ఉందని హత్య చేయించింది యువరానర్ అంటూ లాయర్ తెలియజేస్తాడు.

అందుకు మోనిత అది హత్యకాదు యాక్సిడెంట్ యాక్సిడెంట్ లో అమ్మాయి చనిపోయింది అని చెప్పగా అప్పుడు ఎక్స్క్యూజ్మీ యువరానర్ అది యాక్సిడెంట్ కాదని స్వయంగా ఒప్పుకున్న అటువంటి వీడియో కార్తీక్ భార్య దగ్గర ఉంది అంటూ చెప్పడంతో ఆ సాక్ష్యం చూపించు దీప అనగా వీడియో డిలీట్ అవడంతో షాక్ అవుతుంది.అదే వీడియో కార్తీక్ ఫోన్లో ఉందనగా కార్తీక్ ఫోన్లో కూడా డిలీట్ అవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు రత్న సీత మోనిత వైపు చూడటంతో మోనిత నవ్వుతూ కనిపిస్తుంది. అప్పుడు రత్న సీత ముందుకు వచ్చి మేడం మనం ఫోన్ ఎలా ఉందో అలాగే తిరిగి ఇచ్చేసాము అని చెబుతుంది.

ఏదైనా అభియోగం మోపే ముందు తప్పనిసరిగా ఆధారాలు ఉండాలంటూ మోనిత చెబుతుంది. అలాగే దీప కార్తీక్ బోన్ లోకివచ్చి మోనిత నిజంగానే హత్య చేయించిందనీ ఆక్సిడెంట్ కాదు ఆ సమయంలో నేను కూడా అదే కార్లో ఉన్నాను మోనిత అంజి అనే డ్రైవర్ తో యాక్సిడెంట్ చేయించిందనీ కార్తీక్ చెబుతాడు.అదే విషయాన్ని మోనిత అంజితో మాట్లాడుతున్నప్పుడు నేను వీడియో తీశానని దీప అనడంతో మరి ఆ వీడియో ఎలా డిలీట్ అయిందో అర్థం కావడం లేదని దీప అంటుంది.ఈ విషయంపై మోనిత స్పందిస్తూ మీరు చెప్పేదంతా అబద్ధం అంజి అన్న డ్రైవర్ కేవలం కల్పితం మాత్రమే ఉంటే తనని తీసుకొచ్చి చూపించమనండి అంటూ చెబుతుంది. ఆ మాటకు దీప కచ్చితంగా అంజి ని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తా అంటుంది ఇందాక వీడియో చూపిస్తామన్నారు చూపించలేదు అంజి కూడా కేవలం కల్పితం అనడంతో అందరూ షాక్ అవుతారు. దీంతో జడ్జ్ ఈ కేసు గురించి విచారణ జరిపి అంజి హిమ వివరాలు సేకరించి కోర్టుకు సమర్పించాలని సూచిస్తాడు.ఆ తర్వాత లాయర్ మీరు ఇప్పుడు కడుపుతో ఉన్న మాట నిజమేనా? ఆ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు? అని అనడంతో.. మోనిత కార్తీక్ అని సమాధానం చెప్పగా కార్తీక్ దానికి నాకు ఏ సంబంధం లేదని చెబుతాడు.