Karthika Deepam Serial: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు 1151 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. మోనితకి శిక్ష విధించడంతో ఆమెను జైలుకు తీసుకు వెళతారు జైలు గోడల పై పిచ్చిదాని లాగా నా కార్తీక్ అంటూ జైలు గోడల పై రాసి తనలో తాను పిచ్చిదాని లాగా మాట్లాడుతూ ఉంటుంది నేను ఈ జైలులో 18 నెలలు నీకు దూరంగా ఉండాలా.. ఉంటాను నా మనసులో నిన్ను ప్రేమఖైదీగా చేసుకున్న తర్వాత నేను ఎక్కడైనా ఖైదీగా ఉంటాను నీ నామస్మరణ తో 18 నెలలు గడిపేస్తాను మాట్లాడుతుంది. అంతలోనే అక్కడికి ఒక పోలీస్ ఎంట్రీ ఇచ్చి పడుకోవాలని చెబుతుంది. ఇంతలో మోనితను చూసి.. గోడ పై రాసిన రాతలు చూసి ఎవరు మేడం ఆయన అని అడుగుతుంది.
నువ్వే అన్నావు కదా ఆయన అని నాకు కాబోయే ఆయన నా బిడ్డకు కాబోయే తండ్రి అంటూ సమాధానం చెబుతుంది.జైలు శిక్ష పూర్తి కాగానే పెళ్లి చేసుకుంటాం కార్తీక్ పేరు బాగుంది కదూ మనిషి కూడా చూడడానికి బాగా ఉంటాడు.. ఇంతకీ నీ పేరేంటి అని అడుగుతుంది? సుకన్య అని చెప్పగా మీరు డాక్టర్ అంట కదా మేడం అని అడుగుతుంది.. నా కార్తీక్ కూడా డాక్టరే అంటూ కార్తిక్ గురించి చెప్పడంతో సుకన్య మా జైలర్ గారు ఇది వెరైటీ కేస్ అంటే ఏమో అనుకున్నాను అంటూ మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్తుంది.
ఇక సౌందర్య పిల్లలతో మాట్లాడుతూ గతంలో జరిగిన విషయాలు అన్నింటి గురించి మరిచిపోయి హాయిగా నిద్రపోండి ఇకపై అందరం కలిసి ఉండటం అందరికీ మంచి రోజులు వచ్చాయి అని చెబుతుంది. ఇక దీప తన గదిలో జరిగిన విషయాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ కూర్చుండగా కార్తీక్ వచ్చి మంచం కింద కూర్చొని దీప చేతిని తన చేతిలోకి తీసుకుని ఎమోషనల్ మాటలు మాట్లాడుతాడు. మన జీవితంలో ఎన్ని మలుపులు తిరిగాయి కదా ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని కష్టాలు ఉంటాయా? ఇన్ని కష్టాలు తర్వాత ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు దీప అనగా.. దీప మాట్లాడుతూ తుఫాను మరొక రూపంలో ముంచుకొస్తుందని మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల మళ్లీ సమస్యలు వస్తాయని చెబుతుంది.
11 సంవత్సరాలు ఇంత తొందరగా గడిచిపోయాయి 18 నెలలు గడిచిపోవడం ఎంతసేపు డాక్టర్ బాబు రేపటి రోజున మోనిత బిడ్డతో సహా ఇక్కడికి వస్తే మనం మన పిల్లలకు ఏం సమాధానం చెబుతాం..తిరిగి మన బంధాల్ని ప్రమాదంలో పడేసినట్టు అవుతుంది అందుకే ముందుగానే పిల్లలకు ఈ విషయం చెబుదామని అనగా… కార్తీక్ కోపంతో ఆపు దీప.. ఆ మురికి పనిని పిల్లలకి ఏమని చెబుదాం వాళ్ళు ఏమని అర్థం చేసుకుంటారు ఆ మోనిత బిడ్డను కని ఇక్కడికి వచ్చే లోగా మనం మన కుటుంబంతో అమెరికా వెళ్ళిపోదాం… అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తానని చెబుతాడు. కార్తీక్ మాటలకు దీపం నచ్చచెప్పే ప్రయత్నం చేసిన కార్తీక్ ఇదే ఫైనల్ డెసిషన్ అని చెబుతాడు
ఇక మరుసటి రోజు ఉదయం మహిళ పోలీసు అందరిని లేవాలి అంటూ లేపగా మోనిత కార్తీక్ అంటూ నిద్ర లేస్తూ నేను ఎక్కడున్నాను జైల్లో ఉన్నానా.. అయినా 18 నెలలు ఎంతసేపులే అని మనసులో అనుకుంటూ ఉండగానే ఈ 18 నెలలు దీప కార్తీక్ ని ఏమైనా చేయగలదు. అది సామాన్యమైనది కాదు వాళ్లకు టైం ఇస్తే ఏదైనా చేస్తారు వాళ్లకు అంత టైం నేను ఇవ్వను ఇస్తే నేను మోనిత ఎలా అవుతాను అంటూ వారి కుటుంబాన్ని మరో ప్రమాదంలో నెట్టడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అయితే తన ఆలోచనలను ఆచరింప చేయడం కోసం ఎవరిని ఉపయోగించుకుంటుంది అందుకు సుకన్యను పావుగా వాడుకుందా అనే విషయాలు తెలియాల్సి ఉంది.