Karthika Deepam Serial: అమెరికా ప్లాన్ చేసిన వంటలక్క కుటుంబం.. మోనిత వచ్చేలోపు వెళ్లిపోవాలంటూ?

Karthika Deepam Serial: బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో మోనిత, కార్తీక్ వాదోపవాదనలు విన్న తర్వాత కోర్టు మోనితకు ఐదు లక్షలు జరిమానా.. 18 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడం అయింది. దీంతో మోనితను పోలీసులు జైలుకు తీసుకు వెళుతున్న సమయంలో.. దీప కుటుంబ సభ్యులను ఉద్దేశించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తోంది. ఇక మోనిత జైలుకు వెళ్లడంతో కార్తీక్ కుటుంబ […]

Written By: Navya, Updated On : September 21, 2021 4:33 pm
Follow us on

Karthika Deepam Serial: బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో మోనిత, కార్తీక్ వాదోపవాదనలు విన్న తర్వాత కోర్టు మోనితకు ఐదు లక్షలు జరిమానా.. 18 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడం అయింది. దీంతో మోనితను పోలీసులు జైలుకు తీసుకు వెళుతున్న సమయంలో.. దీప కుటుంబ సభ్యులను ఉద్దేశించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తోంది. ఇక మోనిత జైలుకు వెళ్లడంతో కార్తీక్ కుటుంబ కొంత వరకు ప్రశాంతంగా ఉన్న మనుసులో ఆందోళనతో ఉంటారు.

ఇంట్లో మేడ పై కార్తీక్ గతంలో కార్తీక్ తన బిడ్డల పట్ల, దీపకు చేసిన అన్యాయాన్ని తనకు పెట్టిన బాధలను గుర్తుచేసుకుంటూ బాధపడతాడు. అలాగే మోనిత ఇచ్చిన వార్నింగ్ తలచుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటారు. అదే సమయంలోనే దీప కార్తీక్ కోసం ఇల్లు మొత్తం వేతుకుతుంది. డాక్టర్ బాబు కనిపించలేదని సౌందర్యతో చెప్పగా అంతలో ఆనందరావు వచ్చి ఎక్కడికి వెళ్ళలేదు ఆలోచనలో పడ్డాడని చెప్పడంతో అందరూ మేడ పైకి వెళ్తారు. మేడ పైకి వెళ్ళి దీప పలుకరించడంతో కార్తీక్ తన చేసిన తప్పులకు జీవితాంతం బాధ పడాల్సి వస్తుందని…మోనిత వెళ్తూ వెళ్తూ ఒక బాంబును తీసుకుని వెళ్ళింది అది ఏ క్షణానైనా రావచ్చు అని కంగారు పడతాడు.

ఎప్పుడో జరిగపోయే దానికి ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడటం ఎందుకు కంగారు పడటం ఇప్పుడూ సంతోషంగా ఉండండి అని ధైర్యం చెబుతుంది. పిల్లలతో సంతోషంగా ఉండండి అంటూ సలహా ఇస్తుంది. మరోవైపు శ్రావ్య ఆదిత్య దగ్గరికి వెళ్లి మోనితకి ఎన్ని రోజులు శిక్ష పడిందనీ అడగగా.. ఏడాదిన్నర అంటూ సమాధానం చెబుతారు. అదిగో ఇదిగో అంటే ఏడాదిన్నర పూర్తవుతుంది. ఆ తర్వాత ఎలాంటి టెన్షన్ పడటంతో జైల్లో ఉన్న వారికి జ్ఞానోదయం అవుతుంది అని చెబుతారు మరి ఈ మోనితలో మార్పు వస్తుందేమో చూద్దాం అంటాడు..

ఇక కార్తీక్ గతంలో జరిగిన విషయాలు అన్నింటినీ మర్చిపోయి ఎంతో ప్రశాంతంగా హాల్లో కూర్చుని ఆలోచిస్తాడు… అక్కడికి వచ్చిన శ్రావ్య మిమ్మల్ని ఇలా చూడటం సంతోషంగా ఉంది. ఎన్ని రోజులైంది మిమ్మల్ని ఇలా చూసి అంటుంది. అప్పుడు అక్కడికి పిల్లలు దీప కూడా రావడంతో అందరూ కలిసి సంతోషంగా గడుపుతారు. పిల్లలు ఎక్కడికైనా వెళ్దాం అని అడగడంతో వైజాగ్ వెళదామని ప్లాన్ చేస్తారు. సౌందర్య వచ్చి ఎక్కడికి వెళ్లాల్సింది లేదు.. కాసేపు బయటకు వెళ్లి రండి అంటూ వారిని తిడుతుంది. ఆ సమయంలో సౌర్య ఎమోషనల్ కాగా అంతలో ఆదిత్య అక్కడికి వచ్చి అన్నయ్య అమెరికా వెళ్ళడం కరెక్ట్ అని సలహా ఇస్తాడు.. ఆదిత్య అలా చెప్పడంతో కార్తీక్ ఆలోచనలో పడతాడు.
మోనిత వచ్చేలోగా వీరందరూ అమెరికా వెళ్లాలనే ఆలోచనలో ఉంటాడు కార్తీక్.