https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త.. 65,000 వేతనంతో ఉద్యోగ ఖాళీలు?

దేశంలో కోట్ల సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారు. అయితే నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఈ మధ్య కాలంలో వరుస జాబ్ నోటిఫికేషన్లు రిలీజవుతున్నాయి. పార్లమెంట్ ఆఫ్ ఇండియా పీపీఆర్ విభాగం తాజాగా నిరుద్యోగులకు మేలు జరిగేలా మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 11 ఉద్యోగ ఖాళీలను ఈ సంస్థ భర్తీ చేయనుంది. అసోసియేట్ సీనియర్ కంటెంట్ రైటర్ ఉద్యోగ ఖాళీలతో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 25, 2021 / 12:14 PM IST
    Follow us on

    దేశంలో కోట్ల సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారు. అయితే నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఈ మధ్య కాలంలో వరుస జాబ్ నోటిఫికేషన్లు రిలీజవుతున్నాయి. పార్లమెంట్ ఆఫ్ ఇండియా పీపీఆర్ విభాగం తాజాగా నిరుద్యోగులకు మేలు జరిగేలా మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది.

    మొత్తం 11 ఉద్యోగ ఖాళీలను ఈ సంస్థ భర్తీ చేయనుంది. అసోసియేట్ సీనియర్ కంటెంట్ రైటర్ ఉద్యోగ ఖాళీలతో పాటు సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, జూనియర్ కంటెంట్ రైటర్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు పీపీఆర్ వింగ్ లో ఉన్నటువంటి సోషల్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ యూనిట్‌లో పని చేయాలి.

    ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 65,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఏడాది కాంట్రాక్ట్ తో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుండగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు కాంట్రాక్ట్ గడువు పొడిగించే అవకాశాలు కూడా ఉంటాయి. ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. http://loksabhaph.nic.in/recruitment/advandnot.aspx వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    బ్యాచిలర్ డిగ్రీతో పాటు కనీసం ఏడాది అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 22 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు ఆరోగ్య బీమా లభిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్ -1, రూమ్ నెం. 619, న్యూఢిల్లీ- 110001 అడ్రస్ కు ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.