Karthika Deepam: బుల్లితెర ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా భారతీ రవి పిలుస్తున్నారని కార్తీక్ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తూ భారతి, రవి అంటూ పిలవగా ఆ మాటలు విన్న మోనిత మీ నాన్న వచ్చాడు అంటూ ఎంతో సంతోషపడుతుంది. కార్తీక్ మాట్లాడుతూ.. మోనిత జైలు నుంచి విడుదల అయింది అంట కదా తను మీకు కనిపిస్తే ఇకపై నా గురించి ఆలోచించకుండా పిచ్చిపిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా ఉండమని చెప్పండి అంటూ హాస్పిటల్ తాళాలు అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పిస్తాడు. ఇదే సమయంలోనే రవి మోనిత ఎక్కడ బయటకు వస్తుందో అని కంగారు పడుతుంటాడు. ఇలా కార్తీక్ హాస్పిటల్ బాధ్యతలను వారికి అప్పచెప్పి తిరిగి వెళ్తున్న సమయంలో మోనిత కార్తీక్ కాళ్ళపై పడి నమస్కారం చేస్తుంది.

అలా అని తను చూసిన కార్తిక్ షాక్ అవుతూ హే.. లెయ్ అంటూనే రవి భారతీయ వైపు ఎంతో సీరియస్ గా చూస్తాడు. భారతి ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నారా? ఇంత ద్రోహమా రవి అంటూ వారిపై అరుస్తాడు. ఇదే సమయంలో భారతి ఈ సమయంలో నువ్వు ఇలా వంగకూడదు మోనిత అంటూ చెప్పగా శభాష్ భారతి ఇన్ని రోజులు నాకు మద్దతుగా ఉంటూ నేను పడిన అవమానాలను మరిచి పోయి తనకు సహాయం చేస్తున్నావా అని కోపం తెచ్చుకోగా ఏం చేయమంటావ్ సరాసరి ఇంటికి వచ్చింది అంటూ భారతి,రవి సమాధానం చెబుతారు.
ఆ సమయంలోనే ఇది మా భార్య భర్తలకు సంబంధించిన విషయం మేము మాట్లాడుకుంటామను మోనిత అనగా కార్తీక్ భార్య భర్తలా అంటూ విసుక్కున్నాడు.నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి వి నువ్వు తల్లి నేను అయినప్పుడు మనిద్దరం భార్య భర్తలు కదా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు తన శాడిజం బయట పెడుతుంది.ఈ క్రమంలోనే మేం మరికొన్ని గంటల్లో అమెరికా వెళ్ళిపోతున్నాం ఏం చేసుకుంటావో చేసుకో అని కార్తీక్ అనగా అమెరికా వెళితే నేను కూర్చొని టాటా… బాయ్ చెప్తాను అనుకున్నావా కార్తీక్ నేను అమెరికా వెళ్ళనివ్వను నన్ను చాలా తక్కువ అంచన వేశావ్ కార్తీక్ నేను నిన్ను పద్మవ్యూహంలో బంధించాను పద్మవ్యూహం నుంచి తప్పించుకోలేవు అంటూ చెబుతుంది.
ఇప్పటికే ఎన్నో టీవీ ఛానల్ వాళ్ళు నా ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నారు అని మోనిత అనగా ఏం చెప్తావ్ కృత్రిమ గర్భం తెచ్చుకున్నాం అనే విషయాన్ని చెబుతాను కదా అని అంటాడు.అక్కడే ఒక లాజిక్ మిస్ అయ్యావు కార్తీక్ హాస్పిటల్ కి శాంపిల్స్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి? నీ భార్యపై అనుమానంతో తను నీ పిల్లలు అవునా కాదా అని తెలుసుకోవడానికి ఇదే విషయం మీ పిల్లలు వింటే నీ పరిస్థితి ఏంటి అంటూ మోనిత తన శాడిజం బయట పెట్టడంతో కార్తీక్ రవి భారతి అలా చూస్తూ ఉండిపోతారు. మరి నిజంగానే మోనిత కార్తీక్ ప్రయాణాన్ని ఆపుతుందా తర్వాత ఏం జరుగుతుంది తెలియాల్సి ఉంది.