AP Mega Job Mela: ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వేర్వేరు జిల్లాలలో జాబ్ మేళాలను నిర్వహిస్తూ జాబ్ మేళాల ద్వారా జగన్ సర్కార్ ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాలు జరగనుండగా ఈ జాబ్ మేళాల వల్ల నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో ఈ నెల 30వ తేదీన జాబ్ మేళా జరగనుంది.

మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. 22 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయని తెలుస్తోంది. అపోలో, మెడికవర్, హెటిరో, ఫ్లిప్ కార్ట్, అపాచీ, హ్యుందయ్, బజాజ్, హీరో, ఇసుజు, అమరరాజా బ్యాటరీస్ లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతోంది. 1,000కుపైగా ఉద్యోగాలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నామని మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పుకొచ్చారు.
www.apssdc.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. పది, ఇంటర్, డిగ్రీలో వేర్వేరు విద్యార్హతలు కలిగిన వారు ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రెజ్యూమ్ తో పాటు ఆధార్ కార్డ్ ఇతర ధ్రువపత్రాలను కలిగి ఉండాలి. యువతకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
జాబ్ మేళాకు హాజరు కావడం ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న కంపెనీలలో ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో మేలు జరగనుంది.