Karthika Deepam :బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో కార్తీక్ పిల్లలతో తాను డాక్టర్ అన్న విషయాన్ని ఎవరికీ చెప్పద్దు అని ఎవరైనా అడిగితే ఎరువుల కొట్టులో అకౌంట్స్ రాస్తాడని చెప్పండి అనేసరికి పిల్లలిద్దరూ బాగా ఎమోషనల్ అవుతారు. ఇక దీప ఒక స్కూల్లో మధ్యాహ్న భోజనం కోసం పనిలో చేరుతుంది.
వెంటనే కారులో బయల్దేరుదాం అనుకునేసరికి కారు పాడవుతుంది. ఇక తనకు తెలిసిన ఓ స్నేహితురాలి స్కూటీ మీద రావటంతో అక్కడి నుంచి స్కూటీ తీసుకుని బయలుదేరుతుంది. మరోవైపు కార్తీక్ ఒంటరిగా ఆలోచిస్తూ ఉండగా పిల్లలు వస్తారు. అప్పుడే దీప కూడా వచ్చి తనకు స్కూల్లో వంటలు చేసే పని దొరికిందని.. పిల్లలకు కూడా అదే స్కూల్లో చదువుకోవడానికి అవకాశం ఇచ్చారని చెబుతుంది.
కార్తీక్ బాధపడుతుంటాడు. మరోవైపు ఆనందరావు కార్తీక్ వాళ్ళ గురించి టెన్షన్ పడుతూ ఉండగా సౌందర్య వచ్చి ధైర్యం చెబుతుంది. అక్కడ దీప ఉందని తానే చూసుకుంటుందని ఆ నమ్మకం ఉందని చెబుతుంది. ఇక మోనిత స్కూటీని నేరుగా ఇంట్లోకి తీసుకొచ్చి కార్తీక్ మన బాబు మిస్ అయ్యాడని అరుస్తుంది. అప్పుడే సౌందర్య వాళ్ళు బయట ఎవరో వచ్చారని చూడటానికి వెళ్తారు. మరి మోనిత బాబును ఆదిత్యనే ఎత్తుకెళ్లాడని.. మోనిత గుణపాఠం కోసం చేశాడేమో అని అనిపిస్తుంది.