స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన రెండో బిడ్డకు జన్మనిచ్చింది. రెండో బిడ్డకు ‘జెహ్’ అని పేరును కూడా పెట్టుకుంది. అప్పటి నుండి జెహ్ ఎలా ఉంటాడు ? కరీనా పోలికలు వచ్చాయా ? లేక సైఫ్ లా ఉంటాడా ? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తూ తెగ హడావిడి చేశారు. కానీ ఇప్పటివరకు అయితే జెహ్ కు సంబంధించి ఎలాంటి డిటైల్స్ ను బయట పెట్టలేదు కరీనా జంట.
అదే ‘కరీనా’ పెద్ద కొడుకు తైమూర్ అయితే సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ తో ఎప్పుడూ హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ కరీనా తన రెండో కుమారుడు ‘జెహ్’ను మాత్రం మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది కరీనా. ఎంత జాగ్రత్త పడినా.. తాజాగా జెహ్ ఫోటో ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ ఫోటో ఎలా లీక్ అయింది అంటే…
రీసెంట్ గా కరీనా తన ప్రెగ్నెన్సీ అనుభవాన్ని పుస్తకం రూపంలో తీసుకొచ్చింది. ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రగ్నెన్సీ బైబిల్’ అనే టైటిల్ తో వచ్చిన ఈ పుస్తకంలో కరీనా ఒక చిన్నారిని ముద్దు చేస్తున్నట్లు ఒక ఫోటో ఉంది. కాగా ఈ ఫోటో కరీనా రెండో కుమారుడు ‘జెహ్’దే అని ఇప్పుడు ఓ వార్త నెట్టింట బాగా వైరల్ అవుతుంది.
మరి ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందనేది కరీనా ఫ్యామిలీ స్పందిస్తే గానీ నిర్ధారణ అవ్వదు. 2012లో కరీనా – సైఫ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2016 డిసెంబర్ లో మొదటి బిడ్డగా తైమూర్ జన్మించగా, సుమారు ఐదేళ్ల గ్యాప్ తర్వాత రెండో బిడ్డగా జెహ్ పుట్టాడు. ప్రస్తుతం కరీనా తన పూర్తి సమయం తన పిల్లలకే కేటాయిస్తోంది.