Karate Kalyani: క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కల్యాణి మరో వివాదంలో దూరింది. యూట్యూటర్ శ్రీకాంత్ రెడ్డి తనను పడుకోమన్నాడని ఆరోపిస్తూ అతడిపై దాడికి దిగింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ సంఘటన వైరల్ అవుతోంది. సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. కల్యాణి, శ్రీకాంత్ రెడ్డి ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియడం లేదు. కల్యాణి మాత్రం శ్రీకాంత్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెబుతోంది. దీంతోనే వారి మధ్య వివాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

శ్రీకాంత్ రెడ్డి తన ప్రైవేటు భాగాలపై చేయి వేసి తనతో పడుకోవాలని వేధించినట్లు ఆరోపించింది. దీంతో అతడి చెంప చెల్లుమనిపించాలని తెలిపింది. దీంతో మహిళలపై ఇలా చేస్తున్న వారిని ఏం చేయాలని ప్రశ్నించింది. ఎక్కడో చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించడం సమంజసమా? అని నిలదీసింది. ఫ్రాంక్ వీడియోల పేరుతో ఆడవారిపై అసభ్యంగా ప్రవర్తించడంతో జీర్ణించుకోలేకపోయానని వాపోయింది.
Also Read: Allu Arjun Rejected Story: అల్లు అర్జున్ వదిలేసిన కథ ఎన్టీఆర్ తో చేస్తున్న కొరటాల శివ
మహిళలే లక్ష్యంగా చేసుకుని తన కోర్కెలు తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని చెబుతోంది. దీనిపై శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ సినిమాల్లో ఎలాంటి పాత్రలనైనా చేస్తూ తాను వ్యాంపు పాత్ర చేయమంటే ఇలా దాడి చేస్తారా అంటున్నాడు. నటి కల్యాణి తనపై దురుద్దేశ పూర్వకంగానే దాడి చేసినట్లు చెబుతున్నాడు. తాను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని చెబుతున్నాడు.

కల్యాణితో వచ్చిన ఒకరు మాత్రంతనను పక్కకు తీసుకెళ్లి రూ.70 వేలు ఇస్తే వెళ్లిపోతామని డిమాండ్ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నాడు. కల్యాణి మీద వరుస ఫిర్యాదులు రావడంతో ఆమె ఇబ్బందుల్లో పడినట్లు అయింది. తనకు రెండు లక్షలు ఇస్తాను తనతో పడుకోవాలని శ్రీకాంత్ అడినట్లు కల్యాణి ఆరోపిస్తోంది. మొత్తానికి కరాటే కల్యాణి వ్యవహారం కాస్త హా్ టాపిక్ గా మారింది.
సినిమా ఆర్టిస్టుల జీవితాల్లో వెలుగుల కంటే చీకటి కోణాలే ఎక్కువగా ఉంటాయి. వారి జీవితం ఎంతో ఘనంగా ఉంటుందని భావించినా చివరికి వారిసమస్యలు వారివే. దీంతో కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర కూడా కరువే. ఎప్పుడూ ఏదో ఒక వివాదాల్లో ఇరుక్కుంటూ ఇబ్బందుల్లో పడటం తెలిసిందే.
Also Read:Bheemla Nayak TRP Rating: భీమ్లా నాయక్ TRP రేటింగ్స్ తక్కువ రావడానికి కారణం ఇదేనా!