Bheemla Nayak TRP Rating: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన భీమ్లా నాయక్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే..అతి తక్కువ టికెట్ రేట్స్ తో విడుదల అయినా ఈ సినిమా వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది.. ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకొని విడుదల అయ్యి భారీ విజయం సాధించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంతో ప్రత్యేకం..

Bheemla Nayak
ఒక్క బాక్స్ ఆఫీస్ పరంగా మాత్రమే కాదు..OTT లో కూడా ఈ సినిమా దుమ్ము లేపేసింది..ఇది ఇలా ఉండగా ఇటీవలే స్టార్ మా ఛానల్ లో ఈ సినిమా టెలికాస్ట్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే..పవర్ స్టార్ సినిమా అనగానే మన అందరం భారీ స్థాయి TRP రేటింగ్ వస్తాయి అని ఊహిస్తాము..కానీ మన అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమాకి కేవలం 9 TRP రేటింగ్స్ మాత్రమే వచ్చాయి..పవన్ కళ్యాణ్ రేంజ్ కి ఇది చాలా తక్కువ అనే చెప్పాలి..
Also Read: Shekar Movie Review: రివ్యూ : శేఖర్ మూవీ – హిట్టా ? ఫట్టా ?
పవర్ స్టార్ గత చిత్రం వకీల్ సాబ్ సినిమా జీ తెలుగు ఛానల్ లో మొట్టమొదటిసారి ప్రసారం అయ్యినప్పుడు దాదాపుగా 19 కి పైగానే TRP రేటింగ్స్ ని సాధించింది..జీ తెలుగు లో అంత TRP రేటింగ్స్ రావడం అంటే మాములు విషయం కాదు..కేవలం మొదటిసారి మాత్రమే కాదు రిపీట్ టెలికాస్ట్ లో కూడా ఈ సినిమా అద్భుతమైన TRP రేటింగ్స్ ని సొంతం చేసుకుంది..కానీ భీమ్లా నాయక్ సినిమాకి వకీల్ సాబ్ TRP రేటింగ్స్ లో సగం కూడా రాకపోవడం చూస్తుంటే ఈ సినిమాని ఫామిలీ ఆడియన్స్ పెద్దగా ఆదరించలేదు అనే చెప్పాలి..

vakeel saab
థియేట్రికల్ రన్ లో కూడా ఈ సినిమాని ఫామిలీ ఆడియన్స్ చూసిన సంఖ్య తక్కువే..అంతే కాకుండా భీమ్లా నాయక్ మూవీ టెలికాస్ట్ సమయం లో IPL మ్యాచ్ ఉండడం, దానికి తోడు పిల్లలకి 10 వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు ఉండడం కూడా దెబ్బ వేసింది..లేకపోతే ఈ సినిమా కి కనీసం 14 TRP రేటింగ్స్ వచ్చి ఉండేవి అని ట్రేడ్ వర్గాల అంచనా.
Also Read: Disha Encounter: దిశ ఎన్‌కౌంటర్ బూటకం.. సిర్పూర్కర్ కమిషన్ సంచలన నివేదిక