Karate Kalyani: వాళ్ళను బాగా పిండేస్తున్న కరాటే కళ్యాణి.. కేసుల మీద కేసులు

Karate Kalyani: తెలుగు సినిమాలలో బోల్డ్ క్యారెక్టర్లకు ‘కరాటే కల్యాణి’ పెట్టింది పేరు. మొదట్లో ఐటమ్ పాత్రల్లో దుమ్ము దులుపిన ‘కరాటే కల్యాణి’.. బిగ్ బాస్ లో కూడా బాగానే హల్ చల్ చేసింది. అయితే, ఈ మధ్య ఈ నటి పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతుంది. చిన్నాచితకా సినిమాల్లో హాట్ హాట్ రోల్స్ ను ట్రై చేసినా ఈమెను పెద్దగా ఎవ్వరూ గుర్తించడం లేదు. మొత్తానికి, అదృష్టం కలిసి రాకపోయినా.. లైమ్ లైట్ లో ఉండటానికి బాగానే […]

Written By: Shiva, Updated On : May 31, 2022 5:14 pm

Karate Kalyani

Follow us on

Karate Kalyani: తెలుగు సినిమాలలో బోల్డ్ క్యారెక్టర్లకు ‘కరాటే కల్యాణి’ పెట్టింది పేరు. మొదట్లో ఐటమ్ పాత్రల్లో దుమ్ము దులుపిన ‘కరాటే కల్యాణి’.. బిగ్ బాస్ లో కూడా బాగానే హల్ చల్ చేసింది. అయితే, ఈ మధ్య ఈ నటి పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతుంది. చిన్నాచితకా సినిమాల్లో హాట్ హాట్ రోల్స్ ను ట్రై చేసినా ఈమెను పెద్దగా ఎవ్వరూ గుర్తించడం లేదు. మొత్తానికి, అదృష్టం కలిసి రాకపోయినా.. లైమ్ లైట్ లో ఉండటానికి బాగానే కష్టపడుతుంది. ఇందులో భాగంగా పోలిస్ స్టేషన్ ల చుట్టూ తిరుగుతుంది.

Karate Kalyani

అసభ్యకర ప్రాంక్ వీడియోలు చేస్తున్న యూట్యూబర్స్‌ పై కరాటే కల్యాణి మళ్లీ విరుచుకుపడింది. సుమారు ఇరవై యూట్యూబ్ ఛానెళ్లపై సాక్ష్యాలతో సహా సీసీఎస్ పోలీసులకు కళ్యాణి ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్ట్‌లోని 67A, 509 సెక్షన్ల కింద పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా యూట్యూబ్ ఛానెళ్లపై పోలీసులు నిఘా పెట్టారు.

Also Read: Actress Apoorva: అందాల ఆరబోతలో అపూర్వ రచ్చ రచ్చ.. ఫోటోలు వైరల్ !

అలాగే ఈ కేసు విచారణకు ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేశారు. త్వరలోనే.. సదరు యూట్యూబ్ ఛానెళ్లకు పోలీసులు నోటీసులు కూడా ఇవ్వబోతున్నారు. ప్రాంక్‌ పేరుతో ఆసభ్యవీడియోలు చేస్తున్న వారి పై కరాటే కల్యాణి పెద్ద యుద్ధమే చేస్తోంది. రీసెంట్ గా ప్రాంక్‌ పేరుతో ఆసభ్యవీడియోలు చేశాడు అంటూ యూట్యూబర్‌ శ్రీకాంత్‌ పై కరాటే కల్యాణి దాడి కూడా చేసింది.

Karate Kalyani

యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని ఆమె రోడ్డుమీద పరిగెత్తించి.. గుడ్డలూడదీసి మరీ కొట్టింది. ఈ వీడియోకి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి కూడా. శ్రీకాంత్.. అమ్మాయిలను అగౌరవ పరుస్తూ పిచ్చి పిచ్చి ఫేక్ వీడియోలు చేస్తున్నాడు. అందుకే, కొట్టాను అంటూ కళ్యాణి సగర్వంగా ఈ సమాజానికి చాటి చెప్పుకుంది.

ఏది ఏమైనా కరాటే కళ్యాణి బాగా బోల్డ్. ‘బాబీ పిండేశావ్’ అనే సింగిల్ డైలాగ్ తో బాగా పాపులర్ అయింది ఈ నటి. దాదాపు 250 సినిమాల్లో కరాటే కళ్యాణి నటించినా ఎక్కువగా వ్యాంప్ పాత్రలకే పరిమితం అయింది. కానీ, కరాటే కళ్యాణిలో చాలా కళలే ఉన్నాయి. ఆమెలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ తో పాటు డాన్సర్ కమ్ సింగర్ కమ్ కరాటే కమ్ హరికథ.. ఇలా మల్టీ టాలెంటెడ్ ఆమె. పైగా సమాజంలో ఏ అన్యాయం జరిగినా తనదైన శైలిలో రెచ్చిపోతుంది.

Also Read:Director Sukumar: హద్దులు దాటిపోయిన డైరెక్టర్ సుకుమార్ రెమ్యూమరేషన్

Recommended Videos


Tags