Karan Johar: ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు బాలీవుడ్ వారు కన్నెత్తి సైతం చూసేవారు కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. బాలీవుడ్‌లో పెద్ద పెద్ద హీరోలు సైతం టాలీవుడ్ మూవీస్ పై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎందుకంటే ఇటీవలే టాలీవుడ్ నుంచి వస్తున్న బ్లాక్ బస్టర్ మూవీస్ బాలీవుడ్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. టాలీవుడ్ మూవీస్ లో ఎలాగైనా భాగం పంచుకునేందుకు కరణ్ జోహార్ లాంటి వారు ఉత్సాహం చూపుతున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి మూవీలో కరణ్ భాగస్వామిగా ఉన్నారు. ఇక ప్రస్తుతం వస్తున్న ఆర్ఆర్ఆర్, లైగర్ వంటి మూవీస్ లోనూ ఆయన పాత్ర ఉంది. టాలీవుడ్ మూవీని బాలీవుడ్‌లో ఆయన ప్రమోట్ చేస్తున్నాడు.

తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాజమౌళి, హీరోలు బన్నీ, ప్రభాస్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఆర్ఆర్ మూవీ హిందీలో రూ. 30కోట్లు కలెక్ట్ చేయబోతుందని చెప్పారు. పాన్ ఇండియాకు నిజమైన అర్థం అంటే ఇదే అని చెప్పాడు. రామచరణ్, ఎన్టీఆర్ అంటే బాలీవుడ్ లో చాలా మందికి తెలియదు. కానీ రాజమౌళి బ్రాండ్ అంటే ఏంటో తెలుసని చెప్పుకొచ్చాడు. ఆర్ఆర్ఆర్ మూవీ దేశవ్యాప్తంగా ఫస్ట్ డే వంద కోట్లు కలెక్ట్ చేసే చాన్స్ ఉందని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. పాన్ ఇండియా సత్తా అంటే ఇదీ అని పొగిడాడు.
Also Read: మల్టీస్టారర్ కింగ్ మేకర్స్ ఆప్పుడు బాలచందర్.. ఇప్పుడు రాజమౌళి- జూ.ఎన్టీఆర్
అల్లుఅర్జున్ నటించి పుష్ప మూవీ హిందీలో డబ్ అయ్యింది. అక్కడ రూ.3 కోట్లు సాధించిందని, అక్కడ కనీసం పబ్లిసిటీ చేసుకోలేదని చెప్పుకొచ్చాడు. బన్నీ డబ్బింగ్ మూవీస్‌కు హిందీలో మంచి మార్కెట్ ఉందన్నారు. ప్రభాస్ తన ఆఫీస్ కు వచ్చినప్పుడు అక్కడ చాలా హడావుడి జరిగిందని చెప్పాడు. ఏదైనా మూవీ ఐదు భాషల్లో రిలీజ్ అయితే పాన్ ఇండియా అయిపోదని చెప్పుకొచ్చారు కరణ్. మరి ఆయన చెప్పినట్టుగా ఆర్ఆర్ఆర్ మూవీ ఒకే రోజులో వంద కోట్లు కలెక్ట్ చేస్తుందో లేదో వేచి చూడాలి మరి. ఇలా కలెక్ట్ చేస్తే అది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రికార్డ్ అనే చెప్పాలి.
Also Read: నా చివరి శ్వాస వరకు తారక్ స్నేహం నా గుండెల్లో నిలిచిపోతుంది- చరణ్