Kantara Collections: కన్నడ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కాంతారా సినిమాని తెలుగు లో దబ్ చేసి విడుదల చెయ్యగా ఇక్కడ కూడా సెన్సషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా తెలుగు హక్కులను కేవలం 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు..ఆ రెండు కోట్ల రూపాయిలు కేవలం మొదటి రోజులోనే రికవర్ అయిపోయింది..ఇక రెండవ రోజు నుండి కూడా అదే స్థాయి వసూళ్లను రాబడుతూ ఈ చిత్రం టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్స్ కి కేంద్ర బిందువుగా మారింది..గడిచిన కొద్దీ సంవత్సరాల నుండి డబ్బింగ్ చిత్రాలలో ఈ స్థాయి ప్రభంజనం సృష్టించిన డబ్బింగ్ సినిమా లేదని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఈ చిత్రం లో హీరో గా నటిస్తూ దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి అంటే ఎవరో ఇక్కడి ఆడియన్స్ ఎవ్వరికి కూడా తెలియదు..కానీ కంటెంట్ అద్భుతంగా ఉండడం తో మన తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని నెత్తిన పెట్టుకొని ఆదరించారు..మన తెలుగు సినిమా ఆడియన్స్ కంటే గొప్పోళ్ళు ప్రపంచం లో ఎక్కడ లేరు అనడానికి నిదర్శనం ఇది.
ఇప్పటికే తెలుగు లో విడుదలై 20 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా..ఈ 20 రోజులకు గాను కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 24 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ సినిమాకి వీక్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్స్ ఉండడమే..మన టాలీవుడ్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా పని దినాలలో ఇంత స్టడీ కలెక్షన్స్ రాబట్టడం చూసి చాలా కాలమే అయ్యింది..ముఖ్యం గా మొన్న ఆదివారం రోజు అయితే ఈ సినిమా టాలీవుడ్ లో 16 వ రోజున అత్యధిక వసూళ్లను రాబట్టిన ఏకైక సినిమాగా టాలీవుడ్ లో సరికొత్త చరిత్ర ని సృష్టించింది..అంతే నైజాం వంటి ప్రాంతాలలో ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘గాడ్ ఫాదర్’ కలెక్షన్స్ ని కూడా దాటేసింది అంటే మాములు విషయం కాదు.

మరో పక్క అమెరికా లో కేవలం తెలుగు వెర్షన్ నుండి 1 మిలియన్ డాలర్స్ ని వసూలు చేయబోతుంది..మొత్తం మీద 20 రోజులకు గాను ఈ సినిమా కేవలం తెలుగు వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల రూపాయిల వసూళ్లు సాధించినట్టు తెలుస్తుంది..ఇదే ఊపుని కొనసాగిస్తే ఫుల్ రన్ లో 40 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.