Tollywood Top 5 TRP Rating Movies : మన తెలుగు సినిమాలు ఒక్కోసారి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి టీఆర్ఫీ రేటింగ్స్ లో మాత్రం చతికిలపడడం చాలా సార్లు జరిగాయి..అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచిన కొన్ని సినిమాలు టీఆర్ఫీ రేటింగ్స్ విషయం లో అదరగొట్టిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి..అలా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలి టీవీ టెలికాస్ట్ లో దుమ్ము లేపిన సినిమాల గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము.
1)సర్దార్ గబ్బర్ సింగ్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఈ చిత్రానికి ఫాన్స్ మరియు ఆడియన్స్ నుండి డిజాస్టర్ టాక్ వచ్చింది..కానీ బాక్స్ ఆఫీస్ పరంగా మాత్రం అప్పట్లోనే ఈ చిత్రం 55 కోట్ల రూపాయిల షేర్ ని సొంతం చేసుకుంది..ఇది అప్పట్లో మన స్టార్ హీరోల హిట్టు సినిమాతో సమానమైన వసూళ్లు అన్నమాట..ఈ చిత్రాన్ని మొదటిసారి టీవీలో టెలికాస్ట్ చేసినప్పుడు 15.45 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి..ఈ స్థాయి రేటింగ్స్ స్టార్ మా ఛానల్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సైతం రాలేదనే చెప్పాలి.

2) రభస :
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఈ సినిమా ఒక మాయని మచ్చగా చెప్పుకోవచ్చు..ఎప్పుడు ఓపెనింగ్స్ లో తన సత్తాని చాటే ఎన్టీఆర్ కి ఈ సినిమా కనీసం ఓపెనింగ్స్ కూడా ఇవ్వలేదు..ఫుల్ రన్ లో 26 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమాని మొదటిసారి టీవీ లో టెలికాస్ట్ చేసినప్పుడు 14.48 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి.

3) నా పేరు సూర్య:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మొదటి నుండి ఫామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది చెప్పడానికి మరో ఉదాహరణగా నిలిచింది ఈ చిత్రం..బాక్స్ ఆఫీస్ పరంగా డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమాని మొదటి సారి టీవీ లో టెలికాస్ట్ చేసినప్పుడు 12 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి

4 ) రాధే శ్యామ్:
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ఈ ప్రేమ కథ చిత్రం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..సుమారు 160 కోట్ల రూపాయిల నష్టాలను ఈ సినిమా చవిచూసింది..కానీ మొదటిసారి టీవీ టెలికాస్ట్ చేసినప్పుడు 8 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ ని దక్కించుకొని పర్వాలేదు అని అనిపించుకుంది.

5) వినయ విధేయ రామ:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో..టీఆర్ఫీ రేటింగ్స్ విషయం లో అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది..మొదటిసారి టెలికాస్ట్ చేసినప్పుడు 7.9 రేటింగ్స్ ని దక్కించుకున్న ఈ చిత్రం..రిపీట్ టెలీకాస్ట్స్ లో కూడా అదే స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ 15 సార్లకు పైగా దక్కించుకోవడం అనేది ఒక రేర్ రికార్డుగా చెప్పొచ్చు.

ఇక రీసెంట్ గా టెలికాస్ట్ అయిన ఆచార్య సినిమా కి 6.3 టీఆర్ఫీ రేటింగ్స్ రాగా స్పైడర్ , అజ్ఞాతవాసి చిత్రాలకు కూడా అదే స్థాయి రేటింగ్స్ రావడం జరిగింది..ఇవి ఆ సినిమాలకు ఉన్న కంటెంట్స్ కి మంచి టీఆర్ఫీ రేటింగ్స్ అనే చెప్పాలి కానీ పైన చెప్పిన ఆ టాప్ 5 డిజాస్టర్ మూవీస్ టీఆర్ఫీ రేటింగ్స్ మాత్రం ఎవ్వరు అందుకోలేకపోయారు.