Mokshagna Teja: నందమూరి అభిమానులంతా బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ తేజ(Nandamuri Mokshagna Teja) కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మన అందరికి తెలిసిందే. గత ఏడాది ‘హనుమాన్'(Hanuman Movie) చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో సినిమాని పూజ కార్యక్రమాలతో గ్రాండ్ గా మొదలు పెట్టారు. కానీ అ తర్వాత ఆగిపోయింది. దీంతో మీడియా లో అనేక వార్తలు పుట్టుకొచ్చాయి. ప్రశాంత్ వర్మ పై బాలయ్య చాలా సీరియస్ అయ్యాడని, ఈ సినిమాకి దర్శకత్వం వహించే బాధ్యత నుండి ప్రశాంత్ వర్మ తప్పుకున్నాడని, బాలయ్య(Nandamuri Balakrishna) తన కొడుకుని వేరే డైరెక్టర్ తో లాంచ్ చేయించే ఆలోచనలో ఉన్నాడని ప్రచారమైంది. పలువురి దర్శకుల పేర్లు కూడా వినిపించాయి, స్వయంగా బాలయ్యే దర్శకుడిగా మారి ఆదిత్య 369 సీక్వెల్ ని తన కొడుకుతో తెరకెక్కిస్తాడని, ఇలా ఎన్నో రకాల వార్తలు ప్రచారం అయ్యాయి.కానీ అలాంటిది ఏమి లేదని బాలయ్య సన్నిహిత వర్గాలు చెప్పుకొచ్చాయి.
మోక్షజ్ఞ మొదటి సినిమాకి ప్రశాంత్ వర్మ నే దర్శకత్వం వహిస్తాడని, కాకపోతే కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ‘జై హనుమాన్’ మూవీ కి లాక్ అయ్యి ఉన్నాడు. ‘హనుమాన్’ కి సీక్వెల్ గా తెరకెక్కే ఈ సినిమాలో రిషబ్ శెట్టి హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయ్యాకనే, వేరే సినిమాకి దర్శకత్వం వహించేందుకు అనుమతి ఉంటుంది. అది ప్రశాంత్ వర్మ తన నిర్మాతలతో చేసుకున్న ఒప్పందం. అందుకే మోక్షజ్ఞ తో చేయబోయే సినిమాని తన టీం లో ఉండే కొత్త డైరెక్టర్ తో చేయిస్తానని బాలయ్య తో చెప్పాడట. అందుకు బాలయ్య ససేమీరా నో చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రానికి నువ్వు మాత్రమే దర్శకత్వ వహించాలని, ఆలస్యం అయినా పర్వాలేదు వెయిట్ చేద్దాం అని బాలయ్య ప్రశాంత్ తో అన్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.
ఈ గ్యాప్ లో మోక్షజ్ఞ యాక్టింగ్ లో ఇంకా ఎక్కువ ట్రైనింగ్ తీసుకుంటాడని, ఇతర విభాగాల్లో కూడా పట్టు సారిస్తాడని సమాచారం. అయితే ‘జై హనుమన్'(Jai Hanuman Movie) చిత్రం పూర్తి అవ్వడానికి ఈ ఏడాది సమయం మొత్తం అవసరం అవుతుంది. రిషబ్ శెట్టి ‘కాంతారా’ ప్రీక్వెల్ ని పూర్తి చేసిన తర్వాతనే ‘జై హనుమాన్’ కి డేట్స్ కేటాయించగలడ్డు. అంటే ఈ ఏడాది మొత్తం మోక్షజ్ఞ కెమెరా ముందుకు రావడం కష్టమే అన్నమాట. వచ్చే ఏడాది లో షూటింగ్ మొదలైతే, ఆ ఏడాది చివర్లో కానీ, లేదా 2027 వ సంవత్సరం లో కానీ మోక్షజ్ఞ వెండితెర పై కనిపించే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు నందమూరి అభిమానులు తమ వారసుడు కోసం ఎదురు చూడక తప్పదు. ఇప్పటికే మోక్షజ్ఞ కి 31 ఏళ్ళ వయస్సు వచ్చేసింది.. ఇంకా ఆలస్యం అయితే ఎలా అని అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.