Kantara 2 Movie Twitter Talk: కన్నడ హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty) నటించిన ‘కాంతారా 2′(Kantara 2 Movie) చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ప్రీమియర్ షోస్ తో రిలీజ్ అయ్యింది. ‘కాంతారా’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా కావడం తో ఈ చిత్రానికి కర్ణాటక, నార్త్ ఇండియా లో అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా జరిగాయి కానీ, ఇతర ప్రాంతాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు. కారణం థియేట్రికల్ ట్రైలర్ నీరసంగా ఉండడం వల్లే. మంచి ట్రైలర్ కట్ ని వదిలి అంచనాలు అమాంతం పెంచి, మళ్లీ వాటిని అందుకోవడంలో పొరపాటున విఫలం అయితే రిస్క్ అనుకున్నారో ఏమో తెలియదు కానీ, హీరో/డైరెక్టర్ ట్రైలర్ తో కాస్త అండర్ పెర్ఫార్మ్ చేశారు అనే చెప్పాలి. సినిమా కూడా అలాగే నీరసం గా ఉంటుందేమో అని అనుకున్నారు. కానీ నిన్న ప్రీమియర్ షోస్ చూసి నెటిజెన్స్ ట్విట్టర్ లో చెప్పిన టాక్ ని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
#KantaraChapter1 A Solid Prequel that is technically superb and has a fair share of theater worthy sequences that work well despite a few narration dips and slow pacing at times!
The film picks up right where the first installment leaves off and establishes the backstory…
— Venky Reviews (@venkyreviews) October 1, 2025
సినిమా మొదలైన 10 నిమిషాలు చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఆ తర్వాత కథలోకి వెళ్తారు, స్లో స్క్రీన్ ప్లే తో నడుస్తుంది, అక్కడక్కడా బోర్ కొడుతోంది కానీ, ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో గూస్ బంప్స్ రప్పించారని, ఓవరాల్ గా ఎబోవ్ యావరేజ్ ఫస్ట్ హాఫ్ అని ట్విట్టర్ నుండి టాక్ వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ కి మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆరంభం నుండే మంచి హై తో మొదలైన సినిమా, ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా చేసి, క్లైమాక్స్ చివరి 15 నిమిషాలు మాత్రం పూనకాలు వచ్చే రేంజ్ లో, థియేటర్ లో ఉన్న ఆడియన్స్ ని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లారని, కాంతారా క్లైమాక్స్ ఎంతటి హై వోల్టేజ్ ని ఆడియన్స్ నరాల్లో పాస్ చేసిందో, ఈ సినిమా క్లైమాక్స్ అంతకు పది రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని, ఈ రేంజ్ లో ఉంటుందని అసలు ఊహించలేదని అంటున్నారు.
GIVE
RISHAB SHETTY
EVERY
CINEMA
AWARD
THAT
IS
TO
BE
AWARDED
— Aakashavaani (@TheAakashavaani) October 1, 2025
ముఖ్యంగా హీరో/డైరెక్టర్ రిషబ్ శెట్టి కి ఇండియా లో ఎన్ని అవార్డ్స్ అయితే ఉంటాయో, అన్ని అవార్డ్స్ ని ఇచ్చేయండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాని చాలా హై క్వాలిటీ స్కేల్ లో తెరకెక్కించారని, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండియర్ అద్భుతం గా ఉందని అంటున్నారు. వచ్చిన ఈ టాక్ ని బట్టీ చూస్తుంటే ఈ సినిమా కచ్చితంగా వెయ్యి కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరేలా అనిపిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఆడబోతుంది అనేది ఇప్పుడే చెప్పలేము కానీ, నార్త్ ఇండియా బాక్స్ ఆఫీస్ మాత్రం షేక్ అవుతుందని, పుష్ప 2 చిత్రాన్ని మించిన మేనియా ని ఈ సినిమా క్రియేట్ చేస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఆ రేంజ్ లో ఉంటుందా లేదా అనేది.
Average 1st half, Blockbuster 2nd half..Rishab Shetty performance, especially Climax♂️♂️♂️
BGM #KantaraChapter1 Worth Watch https://t.co/3xd3abqTYW
— Sathvik (@SathvikM9999) October 2, 2025
#KantaraChapter1 #KantaraChapter1Review
Woooaahhh Wat a film man! @shetty_rishab greatest and finest performer you are. You deserve a national award for sure. Nothing less than a perfect shot So far this would be the best film in 2025.Nothing less than a perfect shot.— Vaishu Mahadevan (@VaishuMahadeva2) October 2, 2025
#KantaraChapter1 — BEST Climax In Indian Cinema #Kantara #RishabShetty pic.twitter.com/2UzOYBJpFT
— Kantara Bookings (@KantaraBookings) October 2, 2025