Kannappa Movie : మంచు విష్ణు(Manchu Vishnu) పాన్ ఇండియన్ చిత్రం ‘కన్నప్ప'(Kannappa Movie) ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఏదైనా పాన్ ఇండియన్ సినిమాలకు సంబంధించిన టీజర్, లేదా ట్రైలర్ వచ్చినప్పుడు సోషల్ మీడియా లో ఉన్న నెటిజెన్స్ విశ్లేషణలు చేయడం సర్వసాధారణం. అదే విధంగా ఈ సినిమాకు కూడా అనేక విశ్లేషణలు జరిగాయి. చాలా మందికి ఈ ట్రైలర్ లోని మోహన్ లాల్(Mohanlal) డైలాగ్ కి కన్నప్ప కి మధ్య ఉన్న లింక్ ఏమిటి అనేది అర్థం అయ్యి ఉండదు. దాని వెనుక ఉన్న తాత్పర్యం ఏంటో ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. ‘వీలు విద్యలో నీకంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడని తెలిసి అతని బొటన వేలుని తెగ్గొటించింది నువ్వే కదా..వెళ్ళవయ్యా..వెళ్ళు ఇక్కడి నుండి’ అనేది డైలాగ్.
ఇలా చేసింది మహాభారతం లో ద్రోణాచార్యుడు కదా?, దానికి కన్నప్ప కి మధ్య ఉన్న లింక్ ఏమిటి అనే సందేహం మహాభారతం గురించి తెలిసిన వాళ్లకు కలిగి ఉండొచ్చు. కానీ చరిత్రని బాగా పరిశీలించి చూస్తే అర్జునుడి పునర్జన్మ ‘కన్నప్ప’ అని తెలిసింది. మహాభారతం లో అర్జునుడు శ్రీ మహా విష్ణువు అవతారమైనటువంటి శ్రీ కృష్ణుడికి అత్యంత ప్రియమైన మిత్రుడు. కానీ పునర్జన్మలో ఆయన మహాశివుడికి పరమ భక్తుడు. వాయు లింగాన్ని అసురుల నుండి కాపాడేందుకే కన్నప్ప అవతారం జన్మించిందని చరిత్ర చెప్తుంది. మహాభారతం లోని కర్ణుడి పాత్ర పునర్జన్మ ఎత్తితే ‘కల్కి’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇప్పుడు ‘కన్నప్ప’ విషయం లో మహాభారతం లోని అర్జునుడు పునర్జన్మ ఎత్తాడు. ఫలితం అలాంటిదే రిపీట్ అవుతుందా లేదా అనేది చూడాలి. నార్త్ ఇండియన్స్ ఇలాంటి సినిమాలకు బట్టలు చింపుకునే రోజులివి.
కచ్చితంగా ఈ సినిమాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అందరూ అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో తెలియాలంటే ఈ నెల 27 వరకు ఎదురు చూడాల్సిందే. ఈ చిత్రం ఓపెనింగ్స్ కి కావాల్సినవన్నీ పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు థియేటర్స్ లో ఈలలు కొట్టే సన్నివేశాలు మెండుగా ఉన్నాయని ట్రైలర్ ని చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఓపెనింగ్స్ విషయం లో బయ్యర్స్ భయపడాల్సిన అవసరమే లేదనుకుంటా. మొత్తం మీద ఈ థియేట్రికల్ ట్రైలర్ సినిమా మీద ఆడియన్స్ కి ఉన్న అభిప్రాయాన్ని మొత్తం మార్చేసింది. మంచు విష్ణు కల నెరవేరబోతుందో లేదో చూడాలి.