Allu Arjun Revanth Reddy : నేడు హైదరాబాద్ లో గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ కాసేపటి క్రితమే అట్టహాసంగా మొదలైంది. గడిచిన పదేళ్ల నుండి టాలీవుడ్ లో సంచలనాలను సృష్టించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు, ఆ సినిమాలకు పనిచేసిన దర్శక నిర్మాతలు , నటీనటులను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఈవెంట్ ని నిర్వహించింది. ఈ ఈవెంట్ కి అతిరథ మహారధులందరూ హాజరయ్యారు. ప్రస్తుతానికి అయితే నందమూరి బాలకృష్ణ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా రావాల్సింది కానీ, ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా రెండవ షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్ళాడు. అందుకే ఆయన ఈ ఈవెంట్ కి రాలేకపోయినట్టు తెలుస్తుంది. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కూడా ఆహ్వానం అందింది, ఆయన కూడా హాజరు అవుతాడని టాక్ వినిపిస్తుంది కానీ, ఎంత వరకు నిజమో చూడాలి.
ఇకపోతే ఈ ఈవెంట్ లో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాల్గొని, ఆరంభం లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఈరోజు హైదరాబాద్ లో అంగరంగ వైభవం గా జరుపుకోవడానికి కారణమైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి , సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే ఈరోజు హైటెక్స్ లో జరుగుతున్న ఈ ఈవెంట్ కి విచ్చేసిన మిగిలిన రాజకీయ నాయకులకు, చిత్ర పరిశ్రమకు చెందిన వారికి, మీడియా వారికి అందరికీ స్వాగతం. 14 ఏళ్ళ తర్వాత నేడు తెలుగు సినిమాకు ప్రభుత్వం చేత అవార్డ్స్ ఇచ్చుకోవడం అనేది, తెలంగాణ ఆవిర్భావం జరిగినప్పటి నుండి 2024 వ సంవత్సరం వరకు, ప్రతీ సంవత్సరానికి బెస్ట్ ఫిల్మ్, సెకండ్ బెస్ట్ ఫిల్మ్, థర్డ్ బెస్ట్ ఫిలిమ్స్ ని జ్యురీ అద్వర్యం లో మురళి మోహన్ గారు ఎంపిక చేశారు. నేషనల్ అవార్డ్స్ పొందిన సినిమాలను, నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్న నటీనటులను పరిశీలించి చిన్న సినిమాలను కూడా ఆయన గుర్తించారు. ఇక ఉత్తమ నటుడు క్యాటగిరీ లో అల్లు అర్జున్ ని, ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ని నందమూరి బాలకృష్ణ ని ఎంపిక చేసింది సీఎం రేవంత్ రెడ్డి గారే’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో ని చూసి తెలుసుకోండి.