Kannappa Openings: మంచు కుటుంబానికి చెందిన హీరోల సినిమాలు జనాలు చూడడం మానేసి దశాబ్దం దాటింది. మంచు విష్ణు(Manchu Vishnu) ‘మా’ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ అయ్యాక ఆయన ప్రొడక్షన్ నుండి ‘సన్ ఆఫ్ ఇండియా’,’జిన్నా’ వంటి చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలు ఎంతటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అవసరమా మంచు హీరోలకు సినిమాలు చేయడం, సంతోషం గా విద్యాసంస్థలు నడుపుకుంటూ వేరే వ్యాపారాలు చేసుకోవచ్చు కదా అని కామెంట్స్ చేసిన వారు సోషల్ మీడియా లో ఎంతో మంది ఉన్నారు. కానీ మంచు విష్ణు ఆ కామెంట్స్ కి కృంగిపోలేదు. తనకు టాలీవుడ్ లో అసలు మార్కెట్ లేకపోయినప్పటికీ, తన డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప'(Kannappa Movie) ని భారీ బడ్జెట్ తో నిర్మించాలని సంకల్పించాడు. తన సంకల్పానికి తగ్గట్టుగానే ఈ చిత్రం లో ‘కన్నప్ప’ గా నటిస్తూ నిర్మాణ బాధ్యతలను కూడా తన భుజాన వేసుకొని, ఎన్నో అవరోధాలను దాటుకుంటూ ఈ చిత్రాన్ని నిర్మించి ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.
Also Read: కన్నప్ప ఫుల్ మూవీ రివ్యూ…
మంచు విష్ణు తీసుకున్న అద్భుతమైన నిర్ణయం ఏదైనా ఉందా అంటే, ఈ సినిమాలో ప్రభాస్ చేత స్పెషల్ రోల్ చేయించడమే. కేవలం ప్రభాస్(Rebel star Prabhas) కారణంగా విడుదలకు ముందు ఈ సినిమాకు అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇక నేడు అయితే ఈ సినిమాకు బుక్ మై షో యాప్ లో గంటకు 11 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. మొదటి రోజు ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రెండు నుండి మూడు లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఇదంతా ప్రభాస్ మాస్ అని మొత్తం క్రెడిట్ ఆయనకే ఇవ్వడం కూడా సమంజసం కాదు కానీ, సినిమా మీద కూడా జనాల్లో కాస్త ఆసక్తి రేపింది అనేది మాత్రం వాస్తవం. థియేట్రికల్ ట్రైలర్ తర్వాత అంచనాలు మొత్తం మారిపోయాయి.
ప్రభాస్ స్టార్ స్టేటస్ తో పాటు ట్రైలర్ కూడా బాగుండడం వల్లనే ఈ సినిమాకు ఆ నేడు మంచి ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయని అంటున్నారు విశ్లేషకులు. విడుదలైన ప్రతీ చోట హౌస్ ఫుల్ పడింది. పైగా టాక్ కూడా కలిసి రావడంతో బుక్ మై షో యాప్ మొత్తం ఎరుపెక్కింది. మొదటి రోజు కచ్చితంగా ఈ చిత్రం 15 నుండి 20 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. భక్తి రస చిత్రం కాబట్టి, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ గానే బాక్స్ ఆఫీస్ వద్ద ‘కుబేర’ చిత్ర భారీ అంచనాల నడుమ విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఆ విజయాన్ని ‘కన్నప్ప’ చిత్రం ముందుకు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.