Mohan Babu: సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య మంచి సన్నిహిత్యం ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఒక హీరో ముందుకెళ్తున్నాడు అంటే మనం కూడా ఒక మంచి సినిమా చేసి ముందుకెళ్లాలని ప్రతి హీరో ఆలోచిస్తూ ఉండేవాడు. ఇక ఈ క్రమంలోనే సినిమాల పరంగా పోటీ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం వాళ్లు చాలా సన్నిహితంగా ఉండడమే కాకుండా ఒకరి ఇంట్లో ఫంక్షన్ అయితే మరొకరు అటెండ్ అయ్యి వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు.
ఇక ఇలాంటి హీరోలను మనం చాలామందిని చూశాము. కానీ మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుల మధ్య మాత్రం తరుచూ టామ్ అండ్ జెర్రీ వార్స్ జరుగుతూనే ఉంటాయి. నిజానికి వీళ్లిద్దరు ఒకేసారి కెరీర్ ని స్టార్ట్ చేసినప్పటికీ చిరంజీవి మాత్రం మెగాస్టార్ గా ఎదిగితే, మోహన్ బాబు మాత్రం విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్నాడు గాని, స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు…ఇక వీళ్లిద్దరి మధ్య ఇప్పటికీ తరచూ గొడవలైతే వస్తూ ఉంటాయి. ఇక ఓపెన్ గా కూడా వీళ్ళు చాలాసార్లు గొడవలు పెట్టుకున్నారు. కానీ మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. వీళ్ళ మధ్య టామ్ అండ్ జెర్రీ వార్ జరుగుతుందని చిరంజీవి కూడా చాలాసార్లు ఫన్నీగా చెప్పడం విశేషం…
ఇక ఇదిలా ఉంటే చిరంజీవి మోహన్ బాబుల మధ్య చిన్న చిన్న ఇష్యూస్ రావడం కామన్.. కానీ మోహన్ బాబు కి రజనీకాంత్ తో మాత్రం చాలా మంచి ఫ్రెండ్షిప్ అయితే కుదిరింది. ఇక్కడ చిరంజీవితో అంత మంచి ఫ్రెండ్షిప్ కుదుర్చుకోలేని మోహన్ బాబు.. అక్కడ రజినీకాంత్ తో మాత్రం ‘స్నేహమేరా జీవితం’ అనేంతలో ఫ్రెండ్షిప్ చేయడానికి కారణం ఏంటి అంటే? మోహన్ బాబు చిరంజీవి ఒకే ఇండస్ట్రీలో ఉండడంవల్ల చిరంజీవి ఎదుగుతున్న కొద్ది మోహన్ బాబు కొంతవరకు సహించలేకపోయాడు.
ఇక చిరంజీవి తనను దాటేసి ముందుకు వెళ్ళిపోయాడు కాబట్టి అతన్ని ఏదో ఒక రకంగా మాటల ద్వారా డామినేట్ చేయాలనే ఉద్దేశ్యం తోనే మోహన్ బాబు ఎప్పుడు చిరంజీవి ని ఏదో ఒకటి అంటూ ఉంటాడు. ఇక రజనీకాంత్ పర భాష హీరో కాబట్టి అతనితో ఇతనికి పోటీ ఉండదు. కాబట్టి తనతో సన్నిహితంగా మెలుగుతూ ఉంటాడని ఇప్పటికి చాలా మంది సినీ మేధావులు సైతం ఈ విషయాన్ని చెబుతుంటారు…