Kannappa Movie : మంచు విష్ణు(Manchu Vishnu) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప'(Kannappa Movie). ఇది ఆయన డ్రీం ప్రాజెక్ట్ అని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అందుకే ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా, ఈ చిత్రం కోసం రేయింబవళ్లు ఎంతో కష్టపడుతున్నాడు. మంచు మోహన్ బాబు కి దేశవ్యాప్తంగా ఉన్న పలుకుబడి కారణంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆయన అడిగిన వెంటనే రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) , అక్షయ్ కుమార్(Akshay Kumar), మోహన్ లాల్(Mohanlal) వంటి సూపర్ స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు చేసేందుకు ఒప్పుకున్నారు. వీళ్లకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా విడుదల చేసారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25 న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. అయితే ఇప్పుడు ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు మంచు విష్ణు కాసేపటి క్రితమే తన ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారిక ప్రకటన చేశాడు.
Also Read : ‘దమ్ముంటే ఇండియాకి రా’ అంటూ అన్వేష్ కి కృష్ణ కుమారి వార్నింగ్!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కన్నప్ప ప్రయాణాన్ని వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించి, మీకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించడానికి మేమంతా అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నాం. అందుకోసం మేము కాస్త రాజీ పడాల్సి వస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన VFX వర్క్ చాలా వరకు పెండింగ్ లో ఉంది. బెటర్ క్వాలిటీ రావడం కోసం మేము ఈ చిత్రాన్ని మరికొన్ని రోజులు వాయిదా వేస్తున్నాం. భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ చిత్రాన్ని వాయిదా వేసినందుకు మీ అందరికి నిరాశ కలిగి ఉండొచ్చు. అందుకు నేను మీకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. మీ ఎదురు చూపులకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుంది అని మీకు ప్రమాణం చేస్తున్నాను. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాము’ అంటూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఇప్పటికే ఈ చిత్రం నుండి టీజర్, మూడు పాటలు విడుదల అయ్యాయి. టీజర్ కి యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, మూడు పాటల్లో రెండు పాటలకు మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ పాటల కారణంగా ఈ సినిమా కోసం ఎదురు చూసే వాళ్ళ సంఖ్య కాస్త పెరిగింది అనడంలో వాస్తవం ఉంది. కానీ టీజర్ లో చూపించిన లొకేషన్స్ మొత్తం సహజత్వానికి దగ్గరగా లేవు. ఎదో పార్క్ లో షూటింగ్ చేసిన భావన కలుగుతుంది. ఇది ఈ చిత్రానికి మైనస్ కూడా అవ్వొచ్చు. ఈ సినిమాకు ఓపెనింగ్స్ ని తెచ్చిపెట్టే ఫ్యాక్టర్ ఏదైనా ఉందా అంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే. ఆయన స్టార్ స్టేటస్ మీదనే ఈ సినిమాకు మార్కెటింగ్ జరుగుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో ఆయన దాదాపుగా 40 నిమిషాల పాటు కనిపిస్తాడని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.
Also Read : సందీప్ వంగ లేదా నాగ అశ్విన్..?ఎటూ తేల్చుకోలేకపోతున్న చిరంజీవి!
My Sincere Apologies! pic.twitter.com/WbAUJIVzHq
— Vishnu Manchu (@iVishnuManchu) March 29, 2025