Jr NTR Missing in Kannappa : భక్త కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన కన్నప్ప సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. పరమ శివుడి భక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, యోగి బాబు, ముఖేష్ రిషి, అర్పిత్ రంకా, మంచు అవ్రామ్ తదితరులు నటించారు.
మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలసి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. విడుదలైన రోజే కన్నప్ప సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు. ఈ సినిమాలో విష్ణు నటన హైలైట్‌గా నిలుస్తోందని అంటున్నారు.
ఇక ఈ సినిమా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అరగంట మాత్రమే కనిపించినప్పటికీ, ఆయన సీన్‌లకు ప్రేక్షకుల నుంచి గొప్ప స్పందన వస్తోందని చెబుతున్నారు. ముఖ్యంగా విష్ణు, ప్రభాస్ మధ్య వచ్చే సన్నివేశాలు, డైలాగులకు ఫ్యాన్స్ నుంచి భారీగా విజిల్స్ పడుతున్నాయి. ఈ సినిమాలో రుద్ర పాత్రలో ప్రభాస్ ప్రదర్శన కూడా కన్నప్ప సక్సెస్ లో హైలైట్‌గా నిలుస్తుందని సినీ అభిమానులు, విమర్శకులు పేర్కొంటున్నారు.
శివుడిగా ప్రభాస్.. రుద్రగా ఎన్టీఆర్..
అయితే కన్నప్ప సినిమాలో ముందు శివుడి పాత్రను ప్రభాస్ తో చేయించాలనుకున్నారు మేకర్స్. దీంతో మంచు విష్ణు, మోహన్ బాబు ప్రభాస్ ను కలిసి శివుడి పాత్రను చేయాలని కోరారట. పూర్తి స్క్రిప్ట్ కూడా వినిపించారట. కానీ తాను శివుడి పాత్ర చేయలేనని సున్నితంగా తిరస్కరించాడు ప్రభాస్. ఈ విషయాన్ని గతంలో మంచు విష్ణు స్వయంగా వెల్లడించారు. ఎలాగైనా ప్రభాస్ ను కన్నప్పలో భాగం చేయాలని అనకున్నారు. అప్పటికే రుద్ర క్యారెక్టర్ ను డిజైన్ చేసుకున్నారు. కానీ తొలుత ఈ క్యారెక్టర్ ను మరో స్టార్ హీరోను అనుకున్నారు. అయితే అది ఎవరో కాదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం టాలీవుడ్ డైలాగ్ డెలివరీలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇక రుద్ర క్యారెక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చారు. కానీ శివుడిగా ప్రభాస్ చేయలేనని చెప్పడంతో మేకర్స్ డైలామాలో పడ్డారు. దీంతో కథలో కీలకంగా నడిచే క్యారెక్టర్ తో పాటు ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఉంటుందని రుద్ర క్యారెక్టర్ ఆపర్ చేశాడు మోహన్ బాబు. తన బాడీ లాంగ్వేజ్ తో పాటు ఇమేజ్ కు సరిపడా క్యారెక్టర్ కావడం, మంచు ఫ్యామిలీతో రెబల్ కుటుంబానికి మంచి బాండింగ్ ఉండడంతో ప్రభాస్ కూడా ఒప్పుకున్నాడు.
దద్దరిల్లుతున్న థియేటర్లు..
ఇక తెరమీద ప్రభాస్ చేసిన రుద్ర క్యారెక్టర్‌కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ప్రభాస్ తెరమీద కనిపించినంత సేపు అభిమానుల కేరింతలతో థియేటర్లు ఊగిపోతున్నాయి. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ ఏ పాత్ర చేసినా అది ఆ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక కన్నప్ప సినిమాలో ప్రభాస్ కనిపించినంత సేపు జోష్ కనిపిస్తున్నది.
మొత్తానికి కన్నప్ప సినిమా మంచు అభిమానులు మాత్రమే కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్‌కు కూడా మంచి వినోదాన్ని అందిస్తోందని చెప్పాలి.
– అజయ్ యాదవ్