Kannappa Collection Day 1: మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప'(Kannappa Movie) నిన్న భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై పర్లేదు అనే టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు ని ఎంత ద్వేషించే వారైనా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ సినిమాకి మంచి ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. మంచు కుటుంబం గత నాలుగు సినిమాల క్లోజింగ్ కలెక్షన్స్ ని కలిపినా ఇంత వసూళ్లు రావేమో. మరి ఆ రేంజ్ వసూళ్లు అంటున్నారంటే ఓపెనింగ్స్ కచ్చితంగా 50 కోట్లు, లేదా 100 కోట్లు వచ్చాయి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ చిత్రానికి వచ్చింది కేవలం 13 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే. ఈమధ్య కాలం లో విడుదలైన శ్రీవిష్ణు చిన్న చిత్రం ‘సింగిల్’ కి మొదటి రోజు ఇంతకంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి.
Also Read: ప్రముఖ బాలీవుడ్ నటి మృతి..కన్నీటి పర్యంతమైన భర్త..హృదయాలను పిండేస్తున్న వీడియో!
కానీ అసలు మార్కెట్ లేని మంచు విష్ణు(Manchu Vishnu) కి ఈ స్థాయి ఓపెనింగ్ అంటే చాలా ఎక్కువే అని అనుకోవాలి. మొదటి నుండి పాన్ ఇండియా చిత్రం,చాలా పెద్ద చిత్రం అని జనాల్లోకి తీసుకెళ్లడం లో మంచు విష్ణు సక్సెస్ అయ్యాడు. అంతే కాకుండా ఈ చిత్రం లోని పాటలు, ట్రైలర్ కూడా క్లిక్ అయ్యింది. ఈ ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత ఆడియన్స్ ఈ సినిమాలో ఎదో విషయం కచ్చితంగా ఉంది అని అనుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మంచు విష్ణు తీసుకున్న మరో అద్భుతమైన నిర్ణయం ప్రభాస్ ని ఈ చిత్రం లో నటించేలా ఒప్పించడం. ప్రభాస్ కారణంగా ఈ సినిమాకి కనీసం 70 శాతం కి పైగా ఓపెనింగ్స్ కలిసి వచ్చి ఉంటుంది. ఇదే ప్రభాస్ వేరే మీడియం రేంజ్ హీరో సినిమాలో స్పెషల్ రోల్ చేసి ఉంటే 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లకు పైసా తక్కువ వచ్చేది కాదని విశ్లేషకుల అభిప్రాయం.
ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే ఉత్తరాంధ్ర నుండి కోటి రూపాయిల షేర్ వసూళ్లు, నైజాం లో రెండు కోట్ల రూపాయిలు,సీడెడ్ లో కోటి 20 లక్షలు,ఇతర కోస్తాంధ్ర ప్రాంతాల నుండి మరో కోటి రూపాయిల షేర్ వసూళ్లు, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతాలకు కలిపి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 13 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకు ఎంత గ్రాస్ వసూళ్లు అయితే వస్తాయో, అంతటి గ్రాస్ వసూళ్లు ఈ సినిమాకు వచ్చాయి. కానీ 200 కోట్లు రూపాయిల బడ్జెట్ అంటూ ప్రచారం చేసాడు కాబట్టి,కనీసం 30 గ్రాస్ అయినా వస్తుందని అనుకున్నారు. కానీ 13 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. ఇది బ్రేక్ ఈవెన్ కి ఏ మాత్రం సరిపోదు. ఫుల్ రన్ లో ఎంత వసూళ్లు వస్తాయో చూడాలి మరి.