Nithiin Thammudu Movie : ‘రాబిన్ హుడ్'(Robinhood Movie) చిత్రం తో హీరో నితిన్(Nithin) కి డేంజర్ బెల్స్ మోగాయి. ఈసారి ఆయన కచ్చితంగా సూపర్ హిట్ కొట్టాల్సిందే. లేకపోతే కెరీర్ మొత్తం రిస్క్ లో పడుతుంది. అందుకే ఆయన ఇక నుండి స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ‘రాబిన్ హుడ్’ చిత్రం కూడా ఆయన మనసుకి బాగా నచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా ఈ సినిమా భారీ విజయం సాదిస్తుందని నితిన్ బలమైన నమ్మకం తో చెప్పాడు. కానీ చివరికి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కానీ ఓటీటీ లో మాత్రం మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ చేస్తున్న రోజుల్లోనే ‘తమ్ముడు'(Thammudu Movie) సినిమాని కూడా సమాంతరం గా చేస్తూ వచ్చాడు. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. రెస్పాన్స్ మామూలు రేంజ్ లో రాలేదు.
నితిన్ ఈసారి చాలా కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నాడు, ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టడం పక్కా అని ట్రైలర్ ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన మొదటి కాపీ సిద్ధమైంది. ఈ కాపీ కి సంబంధించిన ప్రివ్యూ షో ని నిన్ననే హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది బయ్యర్స్ కి స్పెషల్ గా చూపించారు. వాళ్ళ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినట్టు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్. ఇందులో డైరెక్టర్ వేణు శ్రీరామ్ స్క్రిప్ట్ ని తీర్చి దిద్దిన తీరు అద్భుతంగా ఉందని, ఒక పాయింట్ నుండి స్టోరీ మొదలై, హీరో ఊర్లోకి అడుగుపెట్టినప్పటి నుండి స్క్రీన్ ప్లే లో తీసుకున్న మలుపులు చాలా థ్రిల్ కి గురి చేశాయని, నితిన్ ఈ చిత్రం తో భారీ కం బ్యాక్ ఇవ్వబోతున్నాడని బయ్యర్స్ బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేశారట.
ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చే ట్విస్టులకు మైండ్ బ్లాక్ అవుతుందట. వేణు శ్రీరామ్ లో ఇంత టాలెంట్ ఉందా అని విడుదల రోజు సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోతూ మాట్లాడుకుంటారని, చాలా కాలం నుండి సూపర్ హిట్ సినిమాలు లేక వెలవెలబోయిన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఈ సినిమా తో ఊపిరి పీల్చుకుంటుందని బలమైన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈమధ్య కాలంలో విడుదలైన నితిన్ సినిమాలకు విడుదలకు ముందు ఈ రేంజ్ పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఇదే తొలిసారి. ఇక సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఇది ఇలా ఉండగా క్లైమాక్స్ సన్నివేశం ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ హిస్టరీ లో ఏ డైరెక్టర్ కూడా ఆలోచించని విధంగా ప్లాన్ చేశాడట వేణు శ్రీరామ్. ఇంతకీ ఏమి ప్లాన్ చేసాడో చూడాలి.