https://oktelugu.com/

Ram Charan: రామ్ చరణ్ ను ఇమిటేట్ చేస్తున్న కన్నడ స్టార్ హీరో…

రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియాలో వరుస పెట్టి సినిమాలు చేయడమే కాకుండా తనను దాటిపోయే హీరో మరొకరు లేరు అనేలా చాలా కష్టపడుతూ సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : May 18, 2024 / 03:39 PM IST

    Kannada star hero imitating Ram Charan

    Follow us on

    Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించి పెట్టుకున్నాడు. ఇక తండ్రికి తగ్గ తనయుడుగా కూడా ఎదిగాడు.

    అలాంటి రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియాలో వరుస పెట్టి సినిమాలు చేయడమే కాకుండా తనను దాటిపోయే హీరో మరొకరు లేరు అనేలా చాలా కష్టపడుతూ సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నాడు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోల నుంచి అతనికి పోటీ ఎదురైనప్పటికీ ఆయన ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే కన్నడ సినిమా ఇండస్ట్రీలో కేజీఎఫ్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు యశ్..

    ఇక ఇప్పుడు ఈయన పాన్ ఇండియా లో సక్సెస్ ఫుల్ హీరోగా కూడా కొనసాగుతున్నాడు. అయితే కొన్ని లుక్స్ లో యష్ రామ్ చరణ్ లా ఉంటాడు. అయితే ఈ విషయాన్ని ఆయన ముందు కూడా చాలాసార్లు ప్రస్తావించారు. ఇక మొత్తానికైతే ఆయన రామ్ చరణ్ లా ఉండడమే కాదు అప్పుడప్పుడు రామ్ చరణ్ ను ఇమిటేట్ కూడా చేస్తూ నటిస్తూ ఉంటారని ఇప్పుడు చాలామంది ట్రోల్ చేస్తున్నారు. కేజీఎఫ్ అనే కాదు దానికి ముందు సినిమాలను కూడా చూసినట్లయితే ఆయన యాక్టింగ్ కొంచెం రామ్ చరణ్ లాగానే అనిపిస్తూ ఉంటుంది.

    కొన్ని ఎక్స్ ప్రేషన్స్ ని రామ్ చరణ్ లా చేయడానికి తను ట్రై చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు అందరూ కూడా యశ్ రామ్ చరణ్ ను ఇమిటేట్ చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్లైతే చేస్తున్నారు. ఇక మొత్తానికైతే యశ్ కూడా పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదగడం కన్నడ సినిమా ఇండస్ట్రీకి ఒక గర్వ కారణమనే చెప్పాలి. ఇక యశ్, రామ్ చరణ్ ఇద్దరు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అలరించడమే కాకుండా ఇద్దరు సౌత్ సినిమా ఇండస్ట్రీని భారీ స్థాయిలో ఎలివేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు…