Pet Dog Funeral: జంతు ప్రేమ అంటే అది.. పెంపుడు శునకం చనిపోతే ఏం చేశారో తెలుసా?

కదిర్ గ్రామానికి చెందిన మది అనే వ్యక్తి 2014లో డాబర్మాన్ రకానికి చెందిన ఒక శునకాన్ని కొనుగోలు చేశాడు. దానికి రెంబో అని పేరు పెట్టాడు. రెంబో ఆ కుటుంబ సభ్యులతో కలిసిపోయింది.

Written By: Dharma, Updated On : May 18, 2024 3:50 pm

Pet Dog Funeral

Follow us on

Pet Dog Funeral: పది సంవత్సరాలుగా ఆ కుక్కను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కుటుంబంలో ఒక సభ్యురాలిగా భావించారు. ఆ కుక్క కూడా తన విశ్వాసాన్ని చూపించుకుంటూ వచ్చింది. కానీ ఉన్నపలంగా అనారోగ్యానికి గురైంది. అత్యవసర వైద్యం అందించినా కోలుకోలేదు. కన్ను మూయడంతో ఆ కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. తీవ్రంగా రోదించారు. చివరకు ఇంటి ప్రాంగణంలోనే మృతదేహాన్ని ఖననం చేసి తమకున్న జంతు ప్రేమను చాటుకున్నారు. చెన్నైలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

కదిర్ గ్రామానికి చెందిన మది అనే వ్యక్తి 2014లో డాబర్మాన్ రకానికి చెందిన ఒక శునకాన్ని కొనుగోలు చేశాడు. దానికి రెంబో అని పేరు పెట్టాడు. రెంబో ఆ కుటుంబ సభ్యులతో కలిసిపోయింది. తన విశ్వాసాన్ని చూపించేది. ఆ ఇంటికి ఎవరు వచ్చినా అడ్డుకునేది. కుటుంబ సభ్యులకు కూడా రెంబోను విడిచి ఐదు నిమిషాలు ఉండలేకపోయేవారు. అంతలా వారి మధ్య బంధం ఏర్పడింది. కొద్ది రోజుల కిందట ఆ శునకం తీవ్ర అనారోగ్యానికి గురైంది. వెటర్నరీ డాక్టర్లు ఎన్ని చికిత్సలు చేసినా ఫలితం లేకపోయింది. కుక్క మృతి చెందింది. కుటుంబ సభ్యులు వేదనకు గురయ్యారు.

సొంత కుటుంబ సభ్యులు చనిపోతే ఏ విధంగా అంత్యక్రియలు జరుపుతారో అలానే చేశారు. ఆ శునకం పేరుతో ఆ ప్రాంతమంతా పోస్టర్లు వేయించారు. కళేబరాన్ని పూలతో అలంకరించి పాడె మీద ఊరేగించారు. ఇంటి ప్రాంగణంలోనే గొయ్యి తవ్వి ఖననం చేశారు. పెంపుడు శునకంపై మది కుటుంబ సభ్యులు ప్రదర్శించిన జంతు ప్రేమ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంత్యక్రియలకు సంబంధించి వీడియోలు నెట్ ఇంట్లో హల్చల్ చేస్తున్నాయి. తెగ ఆకట్టుకుంటున్నాయి.