https://oktelugu.com/

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి…

Puneeth Rajkumar: కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ గుండెపోటుతో మృతి చెందారు. బెంగుళూరు లోని విక్రమ్ ఆసుపత్రి వైద్యులు ఈ వార్తను అధికారికంగా ప్రకటించారు.  ఈరోజు జిమ్‏లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో…  విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. పునీత్ మరణవార్తతో కన్నడ సినీ పరిశ్రమ తీవ్ర ధిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. పునీత్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ…  ఆయన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 29, 2021 / 02:44 PM IST
    Follow us on

    Puneeth Rajkumar: కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ గుండెపోటుతో మృతి చెందారు. బెంగుళూరు లోని విక్రమ్ ఆసుపత్రి వైద్యులు ఈ వార్తను అధికారికంగా ప్రకటించారు.  ఈరోజు జిమ్‏లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో…  విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. పునీత్ మరణవార్తతో కన్నడ సినీ పరిశ్రమ తీవ్ర ధిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. పునీత్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ…  ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

    పునీత్ రాజ్ కుమార్ మృతి కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.. ఇప్పటికే కర్ణాటకలో థియేటర్స్ మూతపడ్డాయి.ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్షిస్తున్నారు.46ఏళ్ల పునీత్‌ రాజ్‌కుమార్ 1976లో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. 1989 వరకు బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. కొంత విరామం తర్వాత 2002లో అప్పు సినిమా ద్వారా కన్నడ సినీపరిశ్రమలో హీరోగా తెరంగేట్రం చేశారు. పునీత్‌ ఇప్పటివరకు 32 సినిమాల్లో హీరోగా నటించారు. తాజాగా ఈ ఏడాది యువరత్న సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం మరో 2 సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ వార్త దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది.

    Also Read: RajiniKanth: రజినీకాంత్ ఆరోగ్యం విషమించిందా? మళ్లీ ఏమైంది?