Homeఎంటర్టైన్మెంట్Puneeth Raj Kumar: చనిపోయినా ప్రపంచాన్ని చూడనున్న పునీత్ ... నేత్రదానం చేసిన పవర్ స్టార్

Puneeth Raj Kumar: చనిపోయినా ప్రపంచాన్ని చూడనున్న పునీత్ … నేత్రదానం చేసిన పవర్ స్టార్

Puneeth Raj Kumar: సినిమా ఇండస్టీ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది… కన్నడ పరిశ్రమ కన్నీరు పెట్టింది. అభిమానుల గుండెలు బరువెక్కాయి.. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణ వార్త సినీ ప్రేక్షకులను విషాదంలోకి నెట్టింది. ఈ రోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన పునీత్… ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తన ఇంట్లోని జిమ్ లో వర్కవుట్ చేస్తున్న సమయంలో పునీత్ కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు.

kannada power star puneeth raj kumar donated his eyes

వైద్యులు చికిత్స చేసే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండాపోయింది. వైద్యులు పునీత్ ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.. కానీ పరిస్థితి విషమించడంతో పునీత్ కన్నుమూశారు. పునీత్ చనిపోయిన ఆయన కళ్ళు ఈ ప్రపంచాన్ని చూడనున్నాయి. పునీత్ రాజ్ కుమార్ ఆయన కళ్ళను దానం చేశారు. పునీత్ కళ్లను దానం చేయనున్నట్టు ఆయన కుటుంబీకులు తెలిపారు. గతంలో పునీత్ తండ్రి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు కూడా ఆయన కళ్లను మరొకరి కోసం దానం చేశారు.

పునీత్ మరణవార్తతో కన్నడ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు పునీత్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పునీత్ రాజ్ కుమార్ మృతి కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.. ఇప్పటికే కర్ణాటకలో థియేటర్స్ మూతపడ్డాయి. పునీత్ మృతదేహాన్ని ఫ్యాన్స్‌ సందర్శనార్ధం కంఠీరవ స్టేడియంకు తరలించేందుకు ముందుగానే రోడ్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్‌ను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. పునీత్ అంత్యక్రియలు రేపు (శనివారం ) నిర్వహించనున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version