Rachita Ram: హీరోయిన్లు సినిమాల్లోనే కాదు బయట ప్రపంచంలో కూడా పలు విషయాలు దాచుకోకుండా చెప్పేస్తూ వివాదాల్లో ఇరుక్కుంటుంటారు. మొదటి రాత్రి అందరికి ఓ అద్భుతమే. దీంతో దాని కోసం అందరు కూడా ఎంతో ఆతృత పడుతుంటారు. అలాంటి ఫస్ట్ నైట్ గురించి ఓ కథానాయిక తన మనసులోని మాట వెల్లడించి దుమారమే రేపింది. కన్నడ హీరోయిన్ రచితా రామ్ ఓ సందర్భంలో ఫస్ట్ నైట్ గురించి తనదైన శైలిలో స్పందించి ప్రేక్షకుల ఆగ్రహానికి గురైంది.
తాను నటించిన కన్నడ చిత్రం లవ్ యూ రాచ్ అనే చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడించే క్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆమె తనదైన శైలిలో సమాధానం చెప్పి వివాదంలో దూరింది. పెళ్లయిన వారికి ప్రత్యేకంగా చెప్పాలా? మొదటి రాత్రి గురించి అందరికి తెలిసిందే కదా అని తన అభిప్రాయాలు వెల్లడించింది. పెళ్లి తరువాత చేసే రొమాన్స్ ను సినిమాలో చూపించామని చెప్పింది. దీంతో సినిమాపై తన కామెంట్స్ ను సమర్థించుకుంది.
దీనిపై కన్నడ క్రాంతి దళ్ అధ్యక్షుడు తేజస్వి నాగలింగ స్వామి రుచిత ప్రకటనపై మండిపడుతున్నారు. ఆమెపై నిషేధం విధించాలని ఫిలిం చాంబర్ కు విన్నవించాడు. ఆమె విచ్చలవిడితనంగా మాట్లాడుతోందని విమర్శించారు. లవ్ యూ రాచు చిత్రం రాష్ర్టంలో ఆడనివ్వబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రచితకు(Rachita Ram) అనుభవం లేదని కొత్తగా పరిశ్రమలోకి వచ్చి ఏవోవో మాట్లాడుతోందని విమర్శలు వస్తున్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఆడవారు అనుకువగా మాట్లాడాలని సూచించారు. బహిరంగంగా నోరు విప్పడం మంచిది కాదని చెబుతున్నారు. శంకర్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ అజయ్ రావు కూడా నటించడం విశేషం.
Also Read: వచ్చే నెలలోనే అలియా-రణ్‌బీర్‌లకు ఎంగేజ్మెంట్!
బన్నీ ఫేవరేట్ సాంగ్‌పై శ్రీవల్లి ఆసక్తికర కామెంట్!
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More