Bigg Boss 6 Telugu 7Th week Nominations : బిగ్ బాస్ లో సోమవారం వచ్చిందంటే చాలు రచ్చ రంబోలానే.. కంటెస్టెంట్ల నామినేషన్లలతో సెగలు పొగలు కక్కుతుంటారు. ఎక్కడెక్కడి తుప్పాస్ రీజన్లు వెతికి మరీ నామినేట్ చేస్తుంటారు. ఈ వారం కూడా అదే జరిగింది. అందరిలోకి అస్సలు కారణం లేకుండా ఊరికే నామినేట్ చేసింది మాత్రం సింగర్ రేవంత్ నే. అంతమంది నామినేట్ చేసేసరికి ఫాపం రేవంత్ మైండ్ దొబ్బేసింది. చివరకు వచ్చేసరికి బట్టలు విప్పేసి బురదలో మునిగి ‘పుష్ప’లా వింత వింతగా ప్రవర్తించాడు..

బిగ్ బాస్ అంటేనే మైండ్ గేమ్. అందులో ఎవరు మైండ్ తో స్ట్రాంగ్ గా ఉంటారో వారే విజేత. కానీ ఇంటిసభ్యులు అస్సలు కారణం లేనివారిని.. హౌస్ కోసం త్యాగాలు చేసిన వారిని ఈ వారం నామినేట్ చేశారు. ఏదో కెప్టెన్ అయ్యిండి రెండు కునికిపాట్లు తీసినందుకు ఫాపం రేవంత్ ను ఇంటి సభ్యులంతా నామినేట్ చేసి పడేశారు. ఇక మరో దారుణం ఏంటంటే.. హౌస్ చార్జింగ్ కోసం రెండు వారాలు నామినేట్ అయిన రోహిత్ కోసం ఆలోచించి కెప్టెన్ కావాలని తన బాల్ ఇచ్చేసి తప్పుకున్న బాలాదిత్యను ఇంటి సభ్యులంతా అత్యధికంగా నామినేట్ చేశారు.
అందుకే ఇలా త్యాగం చేసినా తనను తప్పుగా అర్థం చేసుకొని నామినేట్ చేసిన ఈ హౌస్ మేట్స్ ఇక తనకు బాగా అర్థమయ్యారని.. నాగార్జున సార్ చెప్పినా వినలేదని.. ఇప్పుడు బుద్దివచ్చిందంటూ బాలాదిత్య లెంపలేసుకున్నాడు.
ఇక ఇనాయాకు బాగా పొగరు వచ్చింది.. ఏకంగా శ్రీహాన్ ను బూతులు తిట్టింది. శ్రీహాన్-ఇనయాల మధ్య పెద్ద ఫైట్ నే జరిగింది. ‘ఏం పీకావ్’ అంటూ నోరుజారింది. ఆమె నోరుకు అడ్డూ అదుపే లేకుండా పోయింది. సూర్యతో ఎఫైర్ లవ్ తగ్గించేసి కాస్త ఆట మీద శ్రద్ధ పెట్టిందనుకునేలోపే తన నోటిదురుసు మరోసారి విలన్ అయ్యింది.
ఇక వాసంతి కూడా సిల్లీ కారణాలతో తనను నామినేట్ చేసినందుకు చిరాకుపడింది. ఆదిరెడ్డి తనను నామినేట్ చేసిన కారణాలు సరైనవి కావంటూ చిందులు తొక్కాడు. ఇక ఈ నామినేషన్స్ పండుగలో ఎవరూ తనను నామినేట్ చేయకపోయేసరికి ఆ బురదలో మునగాల్సిన ఖర్మ పట్టలేదని గలాట గీతూ వెకిలి నవ్వులు నవ్వుతూ సైగలు చేసింది.

మొత్తంగా బిగ్ బాస్ ఈ వారం నామినేట్ అయిన వారితో బురద స్నానం చేసి వారందరికీ జ్ఞానోదయం చేశాడు. ఎక్కువ సార్లు బురదలో మునిగిన రేవంత్ కు కాస్తా మైండ్ దొబ్బినట్టై పుష్పలా ప్రవర్తించాడు. బాలాదిత్య ఎక్కువ సార్లు బురదలో కడిగి కాస్త కఠినంగా మారిపోయాడు.
ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అత్యధిక స్థాయిలో నామినేట్ కావడం విశేషం. ఇక ఈ వారం కెప్టెన్ సూర్య, గీతూ మినహా మిగతా అందరూ నామినేట్ కావడమే హైలెట్ అని చెప్పొచ్చు..