తెలుగు వెండి తెర మీద ఇతర భాషా నటీమణులు తమ అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటునట్లే.. తెలుగు బుల్లి తెర పై కూడా కన్నడ భామలు హల్ చల్ చేస్తున్నారు. మరి ఈ కన్నడ సోయగాల గురించి ముచ్చటించుకుందాం. అయితే, బుల్లితెర హీరోయిన్ అనగానే తక్కువ స్థాయి బ్యూటీలు అని తక్కువ చేసి చూడక్కర్లేదు.
ఈ మధ్య బుల్లితెర భామలు కూడా తమ అందం అభినయంతో ఇప్పుడు వెండి తెర హీరోయిన్లతో పాటు సమానంగా పేరు ప్రఖ్యాతలను తెచ్చుకుంటూ తమకంటూ ప్రత్యేకమైన అభిమాన గణాన్ని సంపాదించుకుంటున్నారు. అయితే, వారిలో మంచి ఆదరణ సొంతం చేసుకున్న లిస్ట్ లో ముందువరుసలో నిలిచే హీరోయిన్ ప్రేమి.
ప్రముఖ సీరియల్ ‘కార్తీక్ దీపం’లో హీరోయిన్ వంటలక్క పాత్రలో ప్రేమి విశ్వనాథన్ అద్భుతమైన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆమె వంటలక్క పాత్రకు అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి అంటే, ఆమెకు ఏ స్థాయి ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వంటలక్క స్థాయిలోనే మరో బుల్లి తెర హీరోయిన్ కూడా తన నటనతో అలరిస్తోంది.
ఆమె జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ హీరోయిన్ ‘అను’. నిజానికి అనుకి అసలు నటన మీద ఆసక్తి లేదు. అయితే, అనుకోకుండా నటి అయ్యింది ‘అను’. తెలుగువారి ఆదరణ సొంతం చేసుకున్న ఈ ‘అను’ కూడా కర్ణాటక నుండి వచ్చిన తారే. మొత్తమ్మీద అను నటనకు విమర్శకుల నుండి గొప్ప ప్రశంసలు కూడా దక్కాయి.
ఇక జీ తెలుగులో ‘కృష్ణ తులసి’ అనే ధారావాహికలో శ్యామ పాత్రలో నటిస్తోన్న కన్నడ హీరోయిన్ ‘ఐశ్వర్య హెచ్’ కూడా తెలుగు వారి లోగిళ్ళలో అడుగు పెట్టి ఆకట్టుకుంటుంది. నేను పుట్టి పెరిగింది అంతా బెంగుళూరులోనే అయినా నాకు కన్నడ పరిశ్రమ కంటే తెలుగు బుల్లితెర అంటేనే ఎక్కువ మక్కువ అంటుంది ఈ ‘మనసిచ్చి చూడు’ సీరియల్ హీరోయిన్.
కన్నడ సీరియల్ నటిగా తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటున్న ఈ బ్యూటీ పేరు ‘కీర్తి భట్’. ఈ కన్నడ భామ తెలుగు సీరియల్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఇక మరో క్రేజీ భామ తెలుగు కన్నడ భాషల ప్రముఖ నటి చైత్ర రై. కర్ణాటక నుండి జీ తెలుగు సూపర్ హిట్ సీరియల్ ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్ళు’ అంటూ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
తన ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి.. తెలుగు–కన్నడభాషల్లో అవలీలగా పదిహేను సీరియల్స్ చేసేసి, ఇప్పటికీ తెలుగు బుల్లితెర పై దూసుకుపోతోంది చైత్ర రై. ఇలా చాలామంది కన్నడ భామలు తెలుగు టీవీ సీరియల్స్ లో నటించి అలరిస్తున్నారు.