
Hero Arrest chetan kumar : కన్నడ చిత్ర పరిశ్రమలో సంచలనం చోటు చేసుకుంది. హీరో చేతన్ కుమార్ అలియాస్ చేతన్ అహింసా అరెస్ట్ అయ్యారు. ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇందుకు కారణమైంది. చేతన్ హిందూ మతాన్ని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. సదరు ట్వీట్ తో ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతీశారనేది ప్రధాన ఆరోపణ. చేతన్ కుమార్ తన ట్వీట్లో.. హిందూయిజాన్ని అబద్దాల మీద నిర్మించారు. రావణుడిని ఓడించిన రాముడు భారత్ ను నిర్మించారనేది అబద్ధం.
బాబ్రీ మసీదు రాముని జన్మ స్థానం అనేది ఒక అబద్ధం. తిపును నన్జె గౌడ, ఉరి గౌడ చంపారు అనేది ఒక అబద్ధం. హిందుత్వాన్ని నిజంతో కూలదోయవచ్చు. ఆ నిజమే సమానత్వం.. అంటూ ట్వీట్ చేశారు. హిందూ మనోభావాలు దెబ్బతీయడంతో పాటు జాతి వైషమ్యాలు రెచ్చగొట్టేదిగా చేతన్ కుమార్ ట్వీట్ ఉందన్న ఆరోపణలపై అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం జడ్జి ఆదేశాల మేరకు జైలుకు తరలించారు.
చేతన్ కుమార్ కి 14 రోజుల కస్టడీ విధించినట్లు సమాచారం. చేతన్ కుమార్ దళితుడు. హిందుత్వం పేరుతో రాజకీయ నాయకులు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని, తమ ప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన వాదన. చేతన్ చాలా కాలంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
VIDEO | Kannada actor Chetan Kumar alias Chetan Ahimsa was arrested by Bengaluru Police earlier in the day in connection with a complaint against him for his alleged 'controversial' tweet about Hindutva. pic.twitter.com/JsSbxmYou5
— Press Trust of India (@PTI_News) March 21, 2023
చేతన్ సామాజిక భావజాలం కలిగిన వ్యక్తి. దళితులు, ఆదివాసుల కోసం ఆయన అనేక పోరాటాలు చేశారు. అక్రమంగా తమ ప్రాంతాలను వీడాలన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూర్గ్ ట్రైబల్స్ తరపున ఆయన పోరాటం చేశారు. క్యాంపైన్ నిర్వహించారు. వారికి న్యాయం జరిగేలా చూశారు. చేతన్ కుమార్ 2007లో ‘ఆ దినగలు’ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యాడు.
Hindutva is built on LIES
Savarkar: Indian ‘nation’ began when Rama defeated Ravana & returned to Ayodhya —> a lie
1992: Babri Masjid is ‘birthplace of Rama’ —> a lie
2023: Urigowda-Nanjegowda are ‘killers’ of Tipu—> a lie
Hindutva can be defeated by TRUTH—> truth is EQUALITY
— Chetan Kumar Ahimsa / ಚೇತನ್ ಅಹಿಂಸಾ (@ChetanAhimsa) March 20, 2023