https://oktelugu.com/

Kanguva movie Review: కంగువా ఫుల్ మూవీ రివ్యూ

సినిమా అనేది చాలా అద్భుతంగా వచ్చిందనే చెప్పాలి. ఇంకా వీళ్ళతో పాటుగా మిగిలిన ఆర్టిస్టులందరూ కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించేలా నటించి మెప్పించారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 14, 2024 8:17 am

    Kanguva movie Review and Rating In Telugu

    Follow us on

    Kanguva movie Review : సినిమా ఇండస్ట్రీలో సూర్య తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియాలో హీరోగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో సూర్య సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన శివ డైరెక్షన్ లో ‘కంగువా’ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….

    కథ

    ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా రెండు శతాబ్దాలను కలుపుతూ రాసుకున్న ఒక పీరియాడికల్ డ్రామా కథ… ఇక ఈ సినిమాలో సూర్య తనకు కావాల్సిన ఒక దశలో మిస్సవుతాడు ఇక దాన్ని ఎలా దక్కించుకున్నాడు అనే ధోరణిలో ఈ సినిమా సాగుతుంది. మరి ఇందులో సూర్య తను నెరవేర్చాల్సిన గోల్ కు తగ్గట్టుగానే ఆయన ముందుకు సాగుతూ ఉంటాడు. తనను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ బాబి డియోల్ ని ఎలా ఎదిరించాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక విశ్లేషణ విషయానికి వస్తే సూర్య ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించడమే కాకుండా డైరెక్టర్ శివ కూడా ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. నిజంగా ఈ సినిమాలోని ఎమోషన్స్ ను శివ బ్యాలెన్స్ చేసిన విధానం అయితే చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది. ఆయన చేసే ప్రతి సినిమాలో సెంటిమెంట్ అనేది హై వోల్టేజ్ లో కీలకపాత్ర వహిస్తుంది. ఈ సినిమాలో కూడా అదే పాయింట్ ను ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ని మాత్రం శివ చేశాడనే చెప్పాలి. మరి అలాంటి శివ ఇంతకు ముందు రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చాడు.

    మరి ఇప్పుడు మాత్రం డిఫరెంట్ జానర్ ని ఎంచుకొని సినిమా చేసి సక్సెస్ సాధించడం అనేది మామూలు విషయం కాదు. నిజానికైతే ఈ సినిమాలో సూర్య తన క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించాడు. ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు చాలా వరకు ప్లస్ అయింది. సాంగ్స్ పరంగా చూసుకుంటే అంత పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వకపోయిన కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది…

    ఇక సినిమాలో ప్రతి సీన్ ను హైలెట్ చేస్తూ ప్రేక్షకులకు అందించే ప్రయత్నం అయితే డైరెక్టర్ శివ చేశాడు. మరి మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి ప్రయత్నం కూడా ప్రేక్షకుడిని మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి ని క్రియేట్ చేయడంలో కూడా మంచి గుర్తింపుని సంపాదించుకుంది.

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్టులు పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తాన్ని సూర్య తన భుజాలపై మోశాడనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా కథ క్లారిటీగా ఉన్నప్పటికి దర్శకత్వ విభాగంలో శివ అదరగొట్టాడు… ఇక శివ ఇమాజినేషన్ కి ఏ మాత్రం తగ్గకుండా సూర్య తన నట విశ్వరూపాన్ని చూపించి సినిమాని సైతం సూపర్ సక్సెస్ గా నిలపడంలో తన వంతు ప్రయత్నం అయితే చేశాడు. ఇక డ్యూయల్ రోల్ లో అదరగొట్టిన సూర్య మరోసారి తను ఎలాంటి నటుడో ప్రూవ్ చేసుకున్నాడు… ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా చేసిన బాబీ డియోల్ కూడా ఎక్కడ కూడా అతి చేయకుండా చాలా డిసెంట్ గా నటించి మెప్పించే ప్రయత్నం అయితే చేశాడు.

    ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనుకున్న బాబీ డియోల్ అనిమల్ సినిమా తర్వాత ఈ సినిమాలో అంత మంచి పర్ఫామెన్స్ ని ఇచ్చాడనే చెప్పాలి…ఇక ఈయన తర్వాత దిశా పటాని కూడా తన పాత్ర పరిధి మేరకు ఎక్కడ డివియేట్ అవ్వకుండా చాలా బాగా నటించి మెప్పించింది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా కోసం వీళ్లంతా చాలా బాగా కష్టపడ్డారు. కాబట్టే సినిమా అనేది చాలా అద్భుతంగా వచ్చిందనే చెప్పాలి. ఇంకా వీళ్ళతో పాటుగా మిగిలిన ఆర్టిస్టులందరూ కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించేలా నటించి మెప్పించారు…

    టెక్నికల్ అంశాలు

    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాలో మ్యూజిక్ అంత పెద్దగా మెప్పించినప్పటికి బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం పర్వాలేదు అనిపించింది. అలాగే సినిమా విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉండడంతో సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి ఎక్కడ బోర్ కొట్టించకుండా ఆ విజువల్స్ అనేవి చాలావరకు ఒక ఫ్రెష్ ఫీల్ ను తీసుకొచ్చాయనే చెప్పాలి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి…ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా కట్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది…

    ప్లస్ పాయింట్స్

    సూర్య యాక్టింగ్
    కొన్ని ఎమోషనల్ సీన్స్
    బిజిఎం

    మైనస్ పాయింట్స్

    ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు బోర్ కొట్టించాయి…
    కొన్ని సీన్లలో ఎడిటింగ్ షార్ప్ గా లేదు…
    పాటలు వినసొంపుగా లేవు…

    రేటింగ్

    ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5

    Kanguva (Telugu) - Release Trailer | Suriya | Bobby Deol | Siva | Devi Sri Prasad | Studio Green