https://oktelugu.com/

Bigg Boss Telugu 8: గౌతమ్ జోలికి వెళ్లొద్దు..యష్మీ ని కంట్రోల్ లో పెట్టు అంటూ నిఖిల్ కి జాగ్రత్తలు చెప్పిన తల్లి!

ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు నభీల్, యష్మీ, రోహిణి, అవినాష్ మరియు నిఖిల్ కుటుంబాలు హౌస్ లోకి వచ్చాయి

Written By:
  • Vicky
  • , Updated On : November 14, 2024 / 08:14 AM IST

    Bigg Boss Telugu 8: Don't go to Gautham Joli..put Yashmi under control, Nikhil's mother warns him!

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు నభీల్, యష్మీ, రోహిణి, అవినాష్ మరియు నిఖిల్ కుటుంబాలు హౌస్ లోకి వచ్చాయి. ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్ లో నిఖిల్ తల్లి నిఖిల్ తో చెప్పిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు సోషల్ మీడియా లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సీజన్ బిగ్ బాస్ ఎపిసోడ్స్ ని చూస్తున్న ఆడియన్స్ కి నిఖిల్ మరియు అతని బ్యాచ్ ఆడుతున్న గేమ్స్ ని చూసి గ్రూప్ గేమ్స్ ఆడుతున్నారు అని అనిపించిన విషయం వాస్తవం. నిఖిల్ వాళ్ళ అమ్మగారు కూడా అదే చెప్పారు. ఆమె మాట్లాడుతూ ‘ఇన్ని రోజులు ఆడింది ఓకే. ఇక నుండి గ్రూప్ గేమ్స్ ఆడకు, నీ సొంతంగా ఆడు, ఎక్కువగా దేనికి ఎమోషనల్ అవ్వకు’ అని చెప్పింది. బయట గౌతమ్ కి పెరుగుతున్న ఫాలోయింగ్ గురించి కూడా ఆమె నిఖిల్ కి డైరెక్ట్ గా చెప్పేసింది.

    గౌతమ్ ని ఎక్కువ టార్గెట్ చెయ్యొద్దని, అతని మీద ఇక నామినేషన్స్ వెయ్యకు అని చెప్పుకొచ్చింది నిఖిల్ తల్లి. గౌతమ్ గేమ్స్ బాగానే ఆడుతున్నాడు కానీ, అతన్ని హైలైట్ చేసింది మాత్రం నిఖిల్ అనే చెప్పాలి. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ అడుగుపెట్టిన రెండవ వారం నుండి నిఖిల్ గౌతమ్ పై విపరీతమైన పగ పెంచేసుకున్నాడు. ఆ తర్వాత అతని మీద కోపంతో ఒక వారం మొత్తం నిఖిల్ వ్యవహరించిన తీరు కారణంగానే గౌతమ్ గ్రాఫ్ ఆకాశాన్ని అంటింది. అతనికంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది ఈ గొడవ దగ్గర నుండే. ఇది ఇలా ఉండగా యష్మీ నిఖిల్ ని ఇష్టపడడం, అతని వెంట తిరగడం కూడా నిఖిల్ తల్లికి నచ్చలేదు. యష్మీ ని కాస్త కంట్రోల్ లో పెట్టుకో అని కూడా నిఖిల్ కి చెప్పుకొచ్చింది.

    మరి నిఖిల్ ఇప్పటి నుండైనా యష్మీ ని దూరం పెడుతాడా?, లేదా ఆమెకి ఆశ చూపిస్తూ ఇంకా తన వెనుక తిప్పుకుంటాడా అనేది చూడాలి. ఇక ప్రేరణ గురించి కూడా నిఖిల్ తల్లి మాట్లాడుతూ ‘ఆమెతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు..ప్రతీ విషయాన్నీ చాలా సీరియస్ గా తీసుకుంటాది. ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కాదు’ అని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా యష్మీ విషయం లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమని ‘ఎవరెవరో..నాకు ఎదురైనా’ అనే పాట రూపం లో పరోక్షంగా హింట్స్ ఇచ్చింది. మరి నిఖిల్ అమ్మ చెప్పిన మాటలను సీరియస్ గా తీసుకుంటాడా అంటే డౌటే. ఎందుకంటే యష్మీ తో ఆయన ఎప్పటి లాగానే ఉన్నాడు. ఇది నిఖిల్ కి ప్లస్ అవుతుందా, లేదా మైనస్ అవుతుందా అనేది చూడాలి. ఆమె ఇంటి నుండి వెళ్లిపోయిన తర్వాత అందరూ ఏమి మాట్లాడారు మీ అమ్మ నీతో అని అడగగా, గ్రూప్స్ గేమ్స్ ఇక నుండి ఆడకు అని చెప్పినట్టు చెప్పుకొచ్చాడు నిఖిల్.