https://oktelugu.com/

Kanguva: ‘కంగువా’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..సూర్య పతనానికి జ్యోతిక కారణం అయ్యిందా..? మరీ ఇంత దారుణమా!

తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి ఇప్పటి వరకు 14 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 8 కోట్ల 11 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఆరవ రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 33 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 20, 2024 / 02:53 PM IST

    Kanguva Movie

    Follow us on

    Kanguva: తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కంగువా’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సూర్య సుమారుగా మూడేళ్ళ సమయాన్ని ఈ సినిమా కోసం కేటాయించాడు, అభిమానులు కూడా సూర్య నుండి ఎదురు చూస్తున్న సరైన సినిమా ఇదేనని అనుకున్నారు. టీజర్, ట్రైలర్ కూడా అభిమానుల్లో ఆశలు చిగురించేలా చేసింది. స్టోరీ లైన్ చాలా బావుంది కానీ, డైరెక్టర్ శివ టేకింగ్ విషయం లో తడబడడంతో ఈ చిత్రానికి టాక్ తేడా కొట్టింది. తెలుగు లో కూడా ఈ సినిమాకి భారీ నష్టాలు తప్పేలా లేవు. కాస్త మంచి టాక్ వచ్చి ఉన్నా ఈ చిత్రానికి కేవలం తెలుగు వెర్షన్ నుండే 100 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చి ఉండేది. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయింది ఈ చిత్రం. ఇది ఇలా ఉండగా విడుదలై 6 రోజులు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో, ప్రాంతాల వారీగా ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

    తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి ఇప్పటి వరకు 14 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 8 కోట్ల 11 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఆరవ రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 33 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చింది. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 25 కోట్ల రూపాయలకు జరగగా, బ్రేక్ ఈవెన్ కి మరో 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. కానీ ఈ వీకెండ్ తర్వాత షేర్ వసూళ్లు రావడం దాదాపుగా కష్టమే. ఫుల్ రన్ కి 3 కోట్ల రూపాయిలు అదనంగా రావొచ్చు అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిజాస్టర్ టాక్ తో కూడా తెలుగు లో 10 కోట్ల రూపాయిలకు పైగా షేర్ వస్తుందంటే, హిట్ అయ్యుంటే ఏ రేంజ్ లో ఉండేదో ఊహించుకోవచ్చు.

    అదే విధంగా తమిళనాడు లో 29 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కర్ణాటక లో 4 కోట్ల 50 లక్షల రూపాయిలు, కేరళలో 6 కోట్ల 10 లక్షల రూపాయిలు, హిందీ వెర్షన్ లో 14 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఓవర్సీస్ లో అయితే 6 రోజులకు కలిపి 22 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా ఆరు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 43 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల్లోకి రావాలంటే మరో 140 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలి. అది అసాధ్యం. అయితే ఈ సినిమా కలెక్షన్స్ పై సూర్య సతీమణి జ్యోతిక కామెంట్స్ ప్రభావం కూడా ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఆమె రివ్యూయర్స్ పై చేసిన కామెంట్స్ కి రివ్యూయర్స్ కి ఇంకా కోపం వచ్చి ఈ చిత్రానికి నెగటివ్ టాక్ రప్పించారని సోషల్ మీడియా లో ఒక వాదన వినిపిస్తుంది.