https://oktelugu.com/

Srikanth Iyengar: కుర్ర హీరోయిన్ ని పెళ్లాడబోతున్న ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్..వైరల్ అవుతున్న ఫోటోలు!

ఇప్పుడు నరేష్, ప్రవిత్ర జంటలను ఆదర్శంగా తీసుకొని, మరో కొత్త జంట పుట్టుకొస్తుందా?, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా అనే సందేహాలు రీసెంట్ గా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఒక ఫోటోని చూస్తే అనిపిస్తుంది.

Written By: Vicky, Updated On : November 20, 2024 2:50 pm
Srikanth Iyengar(2)

Srikanth Iyengar(2)

Follow us on

Srikanth Iyengar: ఇటీవల కాలంలో మన సినీ ఇండస్ట్రీ లో సీనియర్ నటుడు నరేష్, ప్రముఖ నటి పవిత్ర వివాహం ఎంతటి దుమారం రేపిందో మన కళ్లారా చూసాము. నరేష్ కి ఇది నాల్గవ పెళ్లి. రమ్య అనే కర్ణాటక అమ్మాయిని మూడవ వివాహం చేసుకున్న ఆయన, ఆమెతో ఏర్పడిన విబేధాల కారణంగా, చాలా కాలం నుండి ఆమెకి దూరంగా ఉంటూ, నటి పవిత్ర కి దగ్గరయ్యాడు. వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త తెలియగానే రమ్య మీడియా ముందుకు వచ్చిన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. నరేష్ పై పోలీస్ కంప్లైంట్ కూడా వచ్చింది. బెంగళూరు లోని ఒక ప్రైవేట్ హోటల్ లో ఉన్నటువంటి నరేష్, పవిత్ర లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చెప్పులతో కొట్టాలని కూడా చూసింది ఈమె. జరిగిన ఈ సంఘటనలను మొత్తం ఆధారంగా తీసుకొని నరేష్ ‘మళ్ళీ పెళ్లి’ అనే చిత్రం కూడా తీసాడు.

ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు నరేష్, ప్రవిత్ర జంటలను ఆదర్శంగా తీసుకొని, మరో కొత్త జంట పుట్టుకొస్తుందా?, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా అనే సందేహాలు రీసెంట్ గా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఒక ఫోటోని చూస్తే అనిపిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టుగా దూసుకొని పోతున్న శ్రీకాంత్ అయ్యంగార్, అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా చాలా బోల్డ్ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. రీసెంట్ గా ఈయన ఇంస్టాగ్రామ్ పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ గా మారింది. ప్రముఖ నటి జ్యోతి ఈయన బుగ్గ మీద ముద్దు పెడుతున్న సమయంలో తీసిన సెల్ఫీ ని అప్లోడ్ చేస్తూ ‘క్రష్ ఆఫ్ మై లైఫ్..మీరంతా కలిసి మా ఇద్దరికీ పెళ్లి చెయ్యాలి’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. 54 ఏళ్ళ వయస్సు ఉన్నటువంటి శ్రీకాంత్ అయ్యంగార్ , తన కంటే చాలా చిన్న వయస్సు ఉన్న అమ్మాయి ని పెళ్లి చేసుకోవాలనే కోరిక ని బయటకి చెప్పడంతో నెటిజెన్స్ దీని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

ఇక శ్రీకాంత్ అయ్యంగార్ విషయానికి వస్తే, ఈయన 2013 వ సంవత్సరం లో విడుదలైన ‘చమ్మక్ చలో’ అనే చిత్రం ద్వారా ఈయన వెండితెర అరంగేట్రం చేసాడు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాకపోవడం, ఈయనకి పెద్దగా గుర్తింపు రాలేదు కానీ, అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయి. 2018 వ సంవత్సరం నుండి మంచి పాపులారిటీ ని సంపాదించిన ఈయన, ప్రస్తుతం ఇండస్ట్రీ లో మంచి డిమాండ్ ఉన్న అతి తక్కువ మంది క్యారక్టర్ ఆర్టిస్టులతో ఒకరిగా కొనసాగుతున్నాడు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా కూడా పలు సినిమాలు చేసాడు. ఇప్పటికే పెళ్లి చేసుకొని, విడాకులు తీసుకొని కుటుంబానికి దూరం గా ఉంటున్న ఈయన , ఇప్పుడు జ్యోతి తో ఇలాంటి సెల్ఫీలు అప్లోడ్ చేయడం చర్చనీయాంశం అయ్యింది.