బాప్ రే.. సాక్షిలో బిత్తిరి సత్తికి అంత పెద్ద ప్యాకేజా?

బిత్తిరి సత్తి.. అలియాస్ చేవెళ్ల రవికుమార్.. తెలంగాణ భాష.. యాసతో పాపులర్ అయ్యాడు ఈ కమెడియన్. వీ6లో తీన్మార్ వార్తలతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. దాన్నుంచే సినిమాలు, వివిధ కార్యక్రమాల్లోనూ ఫేమస్ అయ్యాడు. ఆ వీ6లో విభేదాలతో.. భారీ ఆఫర్ ఇవ్వడంతో టీవీ9లోకి జంప్ చేశాడు.. ‘ఆర్ఆర్ఆర్’పై రైటర్ సాయి మాధవ్‌ కీలక అప్‌డేట్‌ ఇక అంతా బాగానే సాగుతుందనుకుంటున్న టైంలో టీవీ9 నుంచి సడన్ గా బయటకు వచ్చాడు. సత్తి ఎందుకు బయటకొచ్చాడన్నది ఇంతవరకు అధికారికంగా […]

Written By: NARESH, Updated On : July 18, 2020 5:22 pm
Follow us on


బిత్తిరి సత్తి.. అలియాస్ చేవెళ్ల రవికుమార్.. తెలంగాణ భాష.. యాసతో పాపులర్ అయ్యాడు ఈ కమెడియన్. వీ6లో తీన్మార్ వార్తలతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. దాన్నుంచే సినిమాలు, వివిధ కార్యక్రమాల్లోనూ ఫేమస్ అయ్యాడు. ఆ వీ6లో విభేదాలతో.. భారీ ఆఫర్ ఇవ్వడంతో టీవీ9లోకి జంప్ చేశాడు..

‘ఆర్ఆర్ఆర్’పై రైటర్ సాయి మాధవ్‌ కీలక అప్‌డేట్‌

ఇక అంతా బాగానే సాగుతుందనుకుంటున్న టైంలో టీవీ9 నుంచి సడన్ గా బయటకు వచ్చాడు. సత్తి ఎందుకు బయటకొచ్చాడన్నది ఇంతవరకు అధికారికంగా అటు టీవీ చానెల్.. ఇటు సత్తి కూడా బయటపెట్టలేదు. అయితే ఫాదర్స్ డే సందర్భంగా సత్తి చేసిన స్కిట్ లో తన సొంత నాన్నను పొగుడుతూ ప్రోగ్రాం చేయడం.. అది టెలికాస్ట్ కావడంతో టీవీ9 యాజమాన్యం ఆగ్రహించిందని.. విభేదాలు తలెత్తడంతో సత్తి బయటకొచ్చాడనే టాక్ బయటకు వచ్చింది. ఈ మధ్యే సత్తి సాక్షిలో చేరారు. రావడం రావడమే తనను తీసేసిన టీవీ9కు సెటైర్ గా ప్రోమో రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు.

అయితే వీ6లో నెలకు లక్ష నుంచి లక్షన్నర వరకు అందుకున్న బిత్తిరి సత్తిని టీవీ9 అంతకుమించిన ధరను ఇచ్చి లాక్కుందనే ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు తెలుగు టీవీ వార్తా పరిశ్రమలో కొత్త రికార్డును బిత్తిరి సత్తి సృష్టించారు. సాక్షిలో కొత్త సెటైరికల్ షోను లాంచ్ చేయబోతున్నారు. ఇందుకుగాను ఏకంగా బిత్తిరి సత్తికి సాక్షి ఛానల్ రూ.6.5 లక్షల ప్యాకేజీని పొందినట్టు సమాచారం. ప్యాకేజీలో ప్రధాన భాగం అతడి జీతానికి వెళుతుంది. ఇక ఇందులోనే స్కిట్ రచయితతోపాటు ఇతర యాంకర్లకు కూడా సత్తి చెల్లించాలని ఫుల్ ప్యాకేజీగా అతడికి జీతం ఫిక్స్ చేసినట్టు సమాచారం.

బన్నీ, కొరటాల కాంబో ఫిక్స్‌ అయినట్టేనా!

విశేషం ఏంటంటే.. బిత్తిరి సత్తి జీతం న్యూస్ ఛానల్ మేనేజింగ్ ఎడిటర్స్ కంటే ఎక్కువ అని తెలిసింది. సాక్షి సత్తి ప్రదర్శనపై ఎక్కువగా ఆశలు పెట్టుకొని ఎంతైనా చెల్లించడానికి రెడీ అయ్యింది. ఇటీవలి ప్రోమో వైరల్ కూడా అయ్యింది. ఇక నుంచి సత్తి తన అసలు పేరు చేవెల్ల రవికుమార్ గానే ఎంతో ప్రాచుర్యం పొందాలని నిశ్చయించుకున్నాడు.

బిత్తిరి సత్తికి ప్రజల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏదేమైనా టీవీ షో మొత్తం బృందం సమిష్టిగా పనిచేసినప్పుడు.. కొత్తగా.. సృజనాత్మక ఆలోచనలతో ముందుకెళితే ఖచ్చితంగా ప్రోగ్రాం క్లిక్ అవుతుంది.

ఈసారి సత్తి అతడి బృందం ఎలా నవ్విస్తుందో.. ఎలాంటి ప్రోగ్రాం నిర్వహిస్తుందో మనం చూడాలి. అయితే ఇప్పటిదాకా సత్తి ప్రోగ్రాంలు విఫలం కాలేదు. అదే అతని ట్రాక్ రికార్డ్ కావడం గమనార్హం.