Kangana Ranaut: కంగన రనౌత్ కి ఆవేశం ఎక్కువ. ఆమెకు వ్యవస్థలంటే భయం లేదు. బహుశా సమాజంలోని చీకటి కోణాలను చూసి అనుభవించి అన్నిటినీ భరించి పైకి వచ్చిన హీరోయిన్. బయట గొప్పవాళ్ళుగా చలామణి అవుతూ.. లోపల వాళ్ళు చేసే వికృతి చేష్టలను సహించి పైకి వచ్చిన హీరోయిన్. అందుకే, కంగనా ఎప్పుడూ ఏదో తెలియని కసితో రగిలిపోతూ ఉంటుంది. ఆమెను చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళల్లో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు.

కెరీర్ లో ఎదగడానికి ఆ సమయంలో ఆమె ఎదురు మాట్లాడలేక పోయింది. కానీ ఆమె ప్రస్తుతం ఓ స్టార్. అందుకే ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతుంది. చీకటి రాయుళ్ల బాగోతాలను బట్టబయలు చేస్తూ రోజుకొక రకంగా వాళ్ళకి టార్చర్ చూపిస్తోంది. ఈ క్రమంలో ఆమె పరిధి దాటుతుంది. పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి కూడా ఆమె ఆసక్తిగా లేదు. పోలీస్ వ్యవస్థ విషయంలో కూడా ఆమె ఏ మాత్రం తగ్గడం లేదు. సై అంటే సై అంటోంది.
Also Read: తనపై నమోదైన కేసులపై విచిత్రంగా స్పందించిన కంగనా.. నెట్టింట్లో పోస్ట్ వైరల్
సై అంటే పర్వాలేదు. కస కసిగా బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లను తన అందాల ప్రదర్శనతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చేస్తే చేసింది, ఈ సందర్భంగా ఘాటు మెసేజ్ లు కూడా పోస్ట్ చేస్తోంది. “నా పై మరో రోజూ మరో ఎఫ్ ఐ ఆర్. ఒకవేళ నన్ను అరెస్ట్ చెయ్యాలనుకుంటే ఎలా ? ప్రస్తుతం నేను ఇంట్లో ఏ మూడ్ లో ఉన్నానో తెలుసా ? అంటూ వెరీ హాట్ సెక్సీ ఫోటోని షేర్ చేసి.. మొత్తానికి పొలీస్ లకు తన ఘాటు తనాన్ని హాట్ హాట్ గా పరిచయం చేసింది.
తన పై ఎన్ని కేసులు వేసుకున్నా, తనకు పోయింది ఏమి లేదు అని, తన బోల్డ్ ఫోజు చూపించి ఐ డోంట్ కేర్ అన్నట్లుగా కంగనా స్టిల్స్ వదులుతుంది. అసలు ఈ మధ్య కంగన చేసిన కామెంట్స్ తో ఎంత పెద్ద దుమారం రేగినా ఆమెను పోలీసులు కూడా ఏమి చేయలేకపోతున్నారు. ఆమెకు బీజేపీ అండదండలున్నాయి.
Also Read: అన్నపూర్ణ స్టూడియోలో సమంత.. చైతూతో విడాకుల తర్వాత తొలిసారి ఇలా