Kangana Ranaut Sensational Decision: కంగనా రనౌత్ ఏం చేసినా ప్రత్యేకమే. ఎవరు ఏమనుకున్నా తనకేమి అన్నట్లు ఉంటుంది ఆమె వ్యవహారం. ఎప్పుడు ఎవరి పై ఫైర్ అవుదామా అన్నట్టు ఉంటుంది ఆమె ఆలోచనా విధానం. అసలు బోల్డ్ హీరోయిన్ అయినా, మరీ పచ్చిగా మాట్లాడదు ఒక్క ‘కంగనా రనౌత్’ తప్ప. ఎంత హాట్ బాంబ్ అయినా ఏదొక సందర్భంలో కాస్త అయిన సిగ్గును ప్రదర్శిస్తోంది ఒక్క ‘కంగనా రనౌత్’ తప్ప. కంగనా ఆలోచనా విధానమే కాదు, ఆమె మాటల ప్రవాహం కూడా విభిన్నమే. ఈ క్రమంలోనే సమకాలీన సామాజిక/ రాజకీయ అంశాల మీద ఇష్టం వచ్చినట్లు ఎలాంటి ఫిల్టర్ లేకుండా కుండబద్దలు కొడుతోంది.
తాజాగా కంగనా ఓ షాకింగ్ instagram story పెట్టింది. ఫిల్మ్‌ఫేర్ మేగజైన్ మీద దావా వేస్తానని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ రాసుకొచ్చింది కంగనా. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఫిల్మ్‌ఫేర్ పత్రిక వాళ్లు ఉత్తమనటి అవార్డుకి కంగనాని కూడా నామినేట్ చేశారు. ‘తలైవి’ లో కంగనా చక్కని నటన కనబరిచింది అని, అందుకే ఆమెను నామినేట్ చేస్తున్నాం అని ఫిల్మ్‌ఫేర్ పత్రిక కంగాను నామినేట్ చేసింది. అయితే, ఈ విషయంలో కంగనా అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. ‘‘అనైతిక, అవినీతి పద్ధతులను అవలంభించే ఫిల్మ్‌ఫేర్ లాంటి మ్యాగజైన్స్‌ను నేను 2014 నుంచే బ్యాన్ చేశాను. అయినా ‘తలైవి’లో నా నటనకు వారు పురస్కారం అందజేయాలనుకుంటున్నారు. ఇలాంటి పత్రికలను ప్రోత్సహిస్తే నా నైతిక విలువలను దిగజార్చుకున్నట్టే. అందుకే ఫిల్మ్‌ఫేర్‌కు వ్యతిరేకంగా దావా వేయాలని నిర్ణయించుకున్నాను. అందరికీ ధన్యవాదాలు’’ అని కంగనా రాసుకొచ్చింది. మొత్తానికి కంగనా మళ్లీ షాక్ ఇచ్చింది.
నిజానికి కంగనా రనౌత్ కి ఆవేశం ఎక్కువ. ఆమెకు వ్యవస్థలంటే భయం లేదు. బహుశా సమాజంలోని చీకటి కోణాలను చూసి అనుభవించి అన్నిటినీ భరించి పైకి వచ్చిన హీరోయిన్. బయట గొప్పవాళ్ళుగా చలామణి అవుతూ.. లోపల వాళ్ళు చేసే వికృతి చేష్టలను సహించి పైకి వచ్చిన హీరోయిన్. అందుకే, కంగనా ఎప్పుడూ ఏదో తెలియని కసితో రగిలిపోతూ ఉంటుంది. ఆమెను చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు.
వాళ్ళల్లో స్టార్ హీరోలు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. కెరీర్ లో ఎదగడానికి ఆ సమయంలో ఆమె ఎదురు మాట్లాడలేక పోయింది. కానీ ఆమె ప్రస్తుతం ఓ స్టార్. అందుకే ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతుంది. చీకటి రాయుళ్ల బాగోతాలను బట్టబయలు చేస్తూ రోజుకొక రకంగా వాళ్ళకి టార్చర్ చూపిస్తోంది. ఈ క్రమంలో ఆమె పరిధి దాటుతుంది.
పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి కూడా ఆమె ఆసక్తిగా లేదు. సై అంటే సై అంటోంది. తన పై ఎన్ని కేసులు వేసుకున్నా, తనకు పోయింది ఏమి లేదు అని, తన బోల్డ్ ఫోజు చూపించి ఐ డోంట్ కేర్ అన్నట్లుగా కంగనా స్టిల్స్ వదులుతుంది. అసలు ఈ మధ్య కంగన చేసిన కామెంట్స్ తో ఎంత పెద్ద దుమారం రేగినా ఆమెను పోలీసులు కూడా ఏమి చేయలేకపోతున్నారు. ఆమెకు బీజేపీ అండదండలున్నాయి.