బాప్‌రే.. 48 కోట్లతో ఆఫీస్ పెట్టిన బాలీవుడ్ ‘క్వీన్’

వైవిధ్యమైన చిత్రాలతో పాటు.. తన వ్యవహారశైలిలో తరచూ వివాదాల్లో నిలిచే బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. హీరోయిన్‌ వరుస సినిమాలు చేస్తూనే నిర్మాతగా మారిన కంగన ఈ మధ్య ముంబైలో తన కార్యాలయం ప్రారంభించింది. ఇందులో పెద్ద విశేషం ఏముందని అనుకుంటున్నారా? ఉంది. ఎందుకంటే ఆ ఆఫీసు కోసం ఆమె అక్షరాలా 48 కోట్లు ఖర్చు పెట్టింది. అద్భుతంగా ఉన్న ఆ ఆఫీస్‌ను చూసి అందరూ వావ్ అంటున్నారట. తన ప్రొడక్షన్‌ హౌజ్ […]

Written By: Neelambaram, Updated On : May 28, 2020 4:48 pm
Follow us on


వైవిధ్యమైన చిత్రాలతో పాటు.. తన వ్యవహారశైలిలో తరచూ వివాదాల్లో నిలిచే బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. హీరోయిన్‌ వరుస సినిమాలు చేస్తూనే నిర్మాతగా మారిన కంగన ఈ మధ్య ముంబైలో తన కార్యాలయం ప్రారంభించింది. ఇందులో పెద్ద విశేషం ఏముందని అనుకుంటున్నారా? ఉంది. ఎందుకంటే ఆ ఆఫీసు కోసం ఆమె అక్షరాలా 48 కోట్లు ఖర్చు పెట్టింది. అద్భుతంగా ఉన్న ఆ ఆఫీస్‌ను చూసి అందరూ వావ్ అంటున్నారట. తన ప్రొడక్షన్‌ హౌజ్ కోసం ఆమె ఆ ఆఫీస్‌ను ఏర్పాటు చేసింది. దీన్ని తన అభిరుచికి తగట్టుగా డిజైన్‌ చేయించుకుంది.

ఈ కార్యాలయం కోసం కంగనా కొనుగోలు చేసిన ఈ బిల్డింగ్‌ను ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ షబ్నమ్ గుప్తా చేతుల్లో పెట్టింది. కంగనా అభిరుచులకు తన సృజనాత్మకను జోడించిన షబ్నమ్‌ సర్వాంగ సుందరంగా ఆఫీస్‌ను తీర్చిదిద్దింది. అసలు ప్లాస్టిక్‌ అనేదే వాడకుండా పూర్తిగా పర్యావరణ హితంగా ఉన్న ఆ కార్యాలయం చుట్టూ పచ్చటి మొక్కలు పెంచారు. ఎక్కడ చూసినా ప్రకృతి సోయగాలు కనిపించేలా డిజైన్ చేశారు. ఈ ఆఫీస్‌ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కంగనా తన కల నెరవేరిందని తెగ ఆనంద పడుతోందట. దీనితో అందరూ కంగనాను మెచ్చుకుంటున్నారు. ఇంకొందరేమో ఇంత భారీ మొత్తంతో లగ్జరీ ఇళ్లే వస్తుందని, ఆ బడ్జెట్‌తో మంచి సినిమా కూడా తీయోచ్చని అభిప్రాయపడుతున్నారు. ఏమైనా.. ఇంత ఖర్చు చేసిన కంగనాకు చాలా ధైర్యం ఉందని అంటున్నారు.