Kangana Ranaut: వివాదాల హీరోయిన్ ‘కంగనా రనౌత్’ అంటేనే బాలీవుడ్ కి భయం. ఎప్పుడు ఎవరిని తిడుతుందో అని స్టార్ హీరోల సైతం కంగనా నోరు చూసి భయపడుతూ ఉంటారు. తోటి నటీనటులు అందరూ కంగనా చేతిలో తిట్లు తిన్నవారే. అయితే, ఈ వివాదాల రాణి తాజాగా ‘లాక్ అప్’ షో ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొంది. ఇందులో భాగంగా.. ‘గెహ్రైయాన్’ ప్రమోషన్ల సమయంలో దీపికా పదుకొణె ధరించిన పొట్టి డ్రెస్ వివాదంపై స్పందించాలని ఓ జర్నలిస్ట్.. కంగనాను కోరాడు.

కాగా.. ‘నేను ఇక్కడికి వచ్చింది దీపికను రక్షించడానికి కాదు. ఆమె సినిమాను ప్రమోట్ చేసేందుకు అంతకన్నా కాదు. మీరు కూర్చోండి’ అని కంగనా బదులివ్వడంతో అంతా అవాక్కయ్యారు. మొత్తానికి దీపికా హాట్ హాట్ ఫోజులు పై రెస్పాండ్ కాను అని కంగనా తేల్చి చెప్పింది. అయినా ఎలా మాట్లాడుతుంది ? దీపికా నేడు బోల్డ్ లుక్ లో రెచ్చిపోతుంది. కానీ కంగనా బోల్డ్ ప్రపంచంలో విహరించి విహరించి ప్రస్తుతం అలుపు సొలుపు లతో వాలిపోయిన అందాల పక్షి.
Also Read: బాలయ్య సంచలన నిర్ణయం.. చెప్పినట్టు చేస్తే జగన్ కు నష్టమే !
కాబట్టి.. ఎక్స్ పోజింగ్ విషయంలో కంగనా ఎందుకు నెగిటివ్ కామెంట్స్ చేస్తోంది. అయినా అసలు ఎక్స్ పోజింగ్ తోనే కదా కంగనా పైకి వచ్చింది. పాపం సదరు జర్నలిస్ట్ కు ఈ విషయం తెలియకపోవడం అతని అమాయకత్వానికి నిదర్శనం అనుకోవాలి. ఏది ఏమైనా కంగనా అంటే వివాదాలకు కేంద్ర బిందువు. ఆమె ఏమి చేసినా వింతగానే ఉంటుంది.

అయితే, ఈ వివాదాల రాణి తెలుగు రచయత విజయేంద్ర ప్రసాద్ అంటే మాత్రం ఎనలేని గౌరవాన్ని అభిమానాన్ని చూపిస్తోంది. విజయేంద్ర ప్రసాద్ కథ ఇస్తే కంగనా ఒక్క మాట కూడా మాట్లాడకుండా కథకు ఓకే చెప్పేస్తోంది. ప్రస్తుతం ఆయన కంగనా కోసం రెండు కథలు రాసారు.