https://oktelugu.com/

మరో ఐకానిక్ లీడర్ పాత్రలో కంగనా

బాలీవుడ్ లో కథానాయిక సినిమాలకు కేరాఫ్ అడ్రెస్స్ ‘క్వీన్’ కంగనా రనౌత్. అమ్మడు రీల్ లైఫ్ లో ఎలా ఫైట్ చేస్తుందో, రియల్ లైఫ్ లో కూడా అనేక సామాజిక అంశాల మీద కూడా తన భావాలని డేర్ గా వ్యక్తపరుస్తుంది. ఆ డేరింగ్ చూసే దర్శక నిర్మాతలు పవర్ ఫుల్ సబ్జక్ట్స్ ని ఆమె కొరకు తయారు చేసుకుంటున్నారేమో. వరుసపెట్టి రాజకీయ కథలతోనే సినిమాలు కమిట్ అవుతూ ప్రేక్షకుల్లోనూ, పరిశ్రమ వర్గాలలోనూ ఆసక్తిని పెంచుతున్నారు కంగనా. […]

Written By:
  • admin
  • , Updated On : January 31, 2021 / 04:17 PM IST
    Follow us on

    బాలీవుడ్ లో కథానాయిక సినిమాలకు కేరాఫ్ అడ్రెస్స్ ‘క్వీన్’ కంగనా రనౌత్. అమ్మడు రీల్ లైఫ్ లో ఎలా ఫైట్ చేస్తుందో, రియల్ లైఫ్ లో కూడా అనేక సామాజిక అంశాల మీద కూడా తన భావాలని డేర్ గా వ్యక్తపరుస్తుంది. ఆ డేరింగ్ చూసే దర్శక నిర్మాతలు పవర్ ఫుల్ సబ్జక్ట్స్ ని ఆమె కొరకు తయారు చేసుకుంటున్నారేమో. వరుసపెట్టి రాజకీయ కథలతోనే సినిమాలు కమిట్ అవుతూ ప్రేక్షకుల్లోనూ, పరిశ్రమ వర్గాలలోనూ ఆసక్తిని పెంచుతున్నారు కంగనా.

    ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత బయోపిక్ ‘తలైవి’ ‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తరువాత కంగన మరో రాజకీయ నేపథ్యం ఉన్న కథాంశంలోనే నటించనుంది. భారత రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా తీయబోతున్న పవర్ఫుల్ ప్రాజెక్ట్ ఆమె నెక్స్ట్ మూవీగా చేయనున్నట్లు ఇంస్టాగ్రామ్ లో కంగనా పేర్కొన్నారు.

    ఈ మూవీ గురించి మాట్లాడుతూ… ఐకానిక్ లీడర్ అయిన ఇందిరమ్మగా నటించడం చాలా ఆనందాన్నిస్తుందని, ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం బయోపిక్ కాదని..ఇదొక పొలిటిక‌ల్ డ్రామా మాత్రమేనని ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌కి అర్థ‌మ‌య్యే విధంగా ఉండ‌నుంద‌ని కంగనా అన్నారు. ఇందులో చాలా మంది ప్రముఖ నటులు భాగం అవుతారని వెల్లడించింది. అయితే ఎవరెవరు? ఏయే పాత్రలు పోషిస్తారో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందేనని ప్రకటించింది.