https://oktelugu.com/

మొబిక్విక్ బంపర్ ఆఫర్.. వడ్డీ లేకుండా లోన్ పొందే అవకాశం..?

దేశంలో చాలామంది రుణాలు తీసుకున్నా అధిక వడ్డీ వల్ల ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. అయితే మొబిక్విక్ సంస్థ లోన్ తీసుకోవాలని భావించే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. మొబిక్విక్ సంస్థ తమ కస్టమర్లకు సులభంగానే రుణాలను మంజూరు చేయడానికి సిద్ధమవుతోంది. మొబిక్విక్ సంస్థ హోమ్ క్రెడిట్ ఇండియా సంస్థతో జతకట్టి వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ లోన్ తీసుకోవాలని భావించే వాళ్లు మొబిక్విక్ ద్వారా లోన్ తీసుకుంటే ప్రయోజనాలను పొందవచ్చు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 31, 2021 / 03:21 PM IST
    Follow us on

    దేశంలో చాలామంది రుణాలు తీసుకున్నా అధిక వడ్డీ వల్ల ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. అయితే మొబిక్విక్ సంస్థ లోన్ తీసుకోవాలని భావించే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. మొబిక్విక్ సంస్థ తమ కస్టమర్లకు సులభంగానే రుణాలను మంజూరు చేయడానికి సిద్ధమవుతోంది. మొబిక్విక్ సంస్థ హోమ్ క్రెడిట్ ఇండియా సంస్థతో జతకట్టి వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

    ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ లోన్ తీసుకోవాలని భావించే వాళ్లు మొబిక్విక్ ద్వారా లోన్ తీసుకుంటే ప్రయోజనాలను పొందవచ్చు. సులభంగా ఇంటి నుంచే రుణం పొందే అవకాశం ఉండటంతో మొబిక్విక్ యూజర్లకు ప్రయోజనం చేకూరనుంది. కనీసం 1,500 రూపాయల నుంచి 2,40,000 రూపాయల వరకు రుణం పొందే అవకాశాన్ని మొబిక్విక్ కల్పిస్తోంది. అయితే మొబిక్విక్ కేవైసీ పూర్తి చేసిన కస్టమర్లు మాత్రమే సులభంగా రుణం పొందవచ్చు.

    ఎవరైతే లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తారో వాళ్లు ఎటువంటి తనఖా అవసరం లేకుండా లోన్ ను పొందే అవకాశం ఉంటుంది. 10 వేల రూపాయల వరకు రుణం పొందాలని భావించే వాళ్లు ఎటువంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. అలా కాకుండా 10,000 రూపాయల నుంచి 2,40,000 రూపాయల లోపు రుణం పొందాలని అనుకుంటే మాత్రం వడ్డీ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.

    రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రుణం పొందాలనుకుంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలను అందజేయాల్సి ఉంటుంది. లోన్ పొందాలని భావించి కేవైసీ పూర్తి కాని వారు వెంటనే కేవైసీని పూర్తి చేసుకుని సులభంగా లోన్ ను పొందవచ్చు.