Kangana Ranaut: ప్చ్.. అప్పుడు బూతులు, ఇప్పుడు అభ్యర్థనలు !

Kangana Ranaut: బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన సినిమా ‘తలైవి’ (Thalaivi). అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో కంగనా కాస్త తెలివిగానే ముందుకు పోతుంది. ఇంతకుముందు మహారాష్ట్ర ప్రభుత్వం పై సందర్భం లేకపోయినా.. అడ్డమైన తిట్లు తిడుతూ రెచ్చిపోయిన ఈ బ్యూటీ.. మొత్తానికి తన సినిమా కోసం వెనక్కి తగ్గింది. విరుచుకుపడడం అనే తన శైలికి భిన్నంగా అభ్యర్థనలు చేసేస్తోంది. మొన్నటి వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను […]

Written By: admin, Updated On : September 8, 2021 12:01 pm
Follow us on

Kangana Ranaut: బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన సినిమా ‘తలైవి’ (Thalaivi). అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో కంగనా కాస్త తెలివిగానే ముందుకు పోతుంది. ఇంతకుముందు మహారాష్ట్ర ప్రభుత్వం పై సందర్భం లేకపోయినా.. అడ్డమైన తిట్లు తిడుతూ రెచ్చిపోయిన ఈ బ్యూటీ.. మొత్తానికి తన సినిమా కోసం వెనక్కి తగ్గింది. విరుచుకుపడడం అనే తన శైలికి భిన్నంగా అభ్యర్థనలు చేసేస్తోంది.

మొన్నటి వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను బండ బూతులు తిట్టి.. ఆయన ప్రభుత్వాన్ని దారుణమైన విమర్శలు చేసి.. ఇప్పుడు తన సినిమా కోసం బేలగా ఎలా అభ్యర్థిస్తోంది ? అంటూ.. ఆమె యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కంగనా పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకీ కంగనా ఏమి కోరింది అంటే.. మహారాష్ట్రలో థియేటర్లను తెరవాలట. త్వరగా తెరిస్తే.. చక్కగా తన సినిమాని రిలీజ్ చేసుకొని డబ్బు చేసుకుంటుందట. ఇక పనిలో పనిగా ఇది తన ఒక్కదాని అభ్యర్థన కాదు అని.. మొత్తం బాలీవుడ్ అభ్యర్థన కూడా అంటూ.. మొత్తమ్మీద కంగనా తన అవసరాన్ని హిందీ ఇండస్ట్రీ మొత్తానికి అంటగట్టింది.

ఏది ఏమైనా కంగనా నోటి నుండి బూతులు, విమర్శలు విని విని విసిగి వేసారి పోయిన మహారాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా ఆమె నోటి నుంచి వస్తున్న రిక్వెస్ట్ లను చూసి షాక్ అవుతుంది. కంగనా ఇలా ప్రత్యేకంగా అడగడం ఆమె అభిమానులను కూడా ఆకర్షిస్తోంది. ఇక ‘తలైవి’ ఈ నెల 10న దేశమంతా విడుదల అవుతుంది.

కాకపోతే, మహారాష్ట్రలో రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇంకా ఆ రాష్ట్రంలో థియేటర్లకు అనుమతి రాలేదు. కరోనా కేసులు తగ్గినా మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రిస్క్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉంది. కాబట్టి థియేటర్స్ ఓపెన్ చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు.