
Kangana Ranaut: వివాదాల హీరోయిన్ ‘కంగన రనౌత్’ (Kangana Ranaut) అంటేనే బాలీవుడ్ కి భయం. ఎప్పుడు ఎవరిని తిడుతుందో అని స్టార్ హీరోల సైతం కంగనా నోరు చూసి భయపడుతూ ఉంటారు. తోటి నటీనటులు అందరూ కంగనా చేతిలో తిట్లు తిన్నవారే. అయితే, అలాంటి వివాదాల రాణి రచయత విజయేంద్ర ప్రసాద్ అంటే మాత్రం ఎనలేని గౌరవాన్ని అభిమానాన్ని చూపిస్తోంది.
సహజంగా కథను కంగనా త్వరగా ఫైనల్ చేయదు. తన పైత్యం మొత్తం పెట్టి ఆ తర్వాతే కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అలాంటిది విజయేంద్ర ప్రసాద్ కథ పై మాత్రం కంగనా ఒక్క మాట కూడా మాట్లాడకుండా కథకు ఓకే చెప్పేసింది. మొత్తానికి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ రైటింగ్ పై కంగనాకి బాగా గురి కుదిరినట్టు ఉంది.
ఇక కంగనా అనగానే విజయేంద్రప్రసాద్ కూడా ఓ స్టార్ హీరో పై చూపించే అభిమానాన్ని చూపిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ ‘రామాయణం’ కథని సీత పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే ఆలోచనతో ‘సీత’ అనే ఓ పౌరాణిక కథను రాశారు. అయితే ‘సీత’ పాత్రలో మొదట దీపిక పదుకోనేను అనుకున్నారు, ఆ తర్వాత కరీనా కపూర్ ను ఖరారు చేయాలనుకున్నారు.
కానీ అసలు సిసలు ‘హిందూ నారి’ అయిన కంగనా రనౌత్ ను సీత పాత్ర కోసం ఫైనల్ చేశారు. కంగనా కథ కూడా వినకుండానే నటించడానికి ఒప్పుకుంది. ఇప్పటికే, కంగనా నటించిన ‘మణికర్ణిక’, ‘తలైవి’ సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. అయితే ఆ రెండు సినిమాలు పరాజయం చవి చూశాయి.
అయినా వీరిద్దరూ మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం రెడీ అవ్వడం విశేషం. ఇక తాజాగా ‘సీత’ సినిమా టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.