Kangana Ranaut: కాంతార… ఈ పదం దేశాన్నిఊపేస్తోంది . ఫిల్మ్ క్రిటిక్స్, ఆడియన్స్ అద్భుత చిత్రంగా కాంతారను అభివర్ణిస్తున్నారు. ఈ లిస్ట్ లో తాజాగా హీరోయిన్ కంగనా రనౌత్ చేశారు. కాంతార చిత్రాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతూ కంగనా ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పుడే కాంతార చిత్రం చూశాను. ఇంకా నా ఒళ్ళు జలదరిస్తుంది. వాట్ ఏ మూవీ. మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. రిషబ్ శెట్టికి హ్యాట్సాఫ్.కాంతార సినిమా నేపథ్యం, సందేశం, ఫోటోగ్రఫీ, రచన, దర్శకత్వం, యాక్షన్, థ్రిల్స్.. ప్రతి అంశం ఒక అద్భుతం. సినిమా అంటే ఇది. సినిమాకు కావాల్సింది ఇది. సినిమా చూసి వెళుతున్న ప్రేక్షకులు ఇలాంటి సినిమా ఎప్పుడూ చూడలేదని చెప్పుకుంటున్నారు. నేను ఒక వారం రోజులపాటు ఈ అనుభవం నుండి బయటకు రాలేను.. అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు.

ఒక అద్భుతం చూసిన భావన కంగనా వెల్లిబుచ్చారు. కాంతార మూవీ గొప్పదే, అయితే కంగనా అంతగా పొగడటానికి కారణం బాలీవుడ్ కి చురుకలు అంటించాలని. చాలా కాలంగా కంగనా రనౌత్ బాలీవుడ్ పై పోరాటం చేస్తుంది. పరిశ్రమకు చెందిన పెద్దలను విమర్శిస్తోంది. నెపో కిడ్స్ అంటే కంగనా రనౌత్ కి మంట. గతంలో ఇండియాలో పెద్ద సినిమా పరిశ్రమ తెలుగు, హిందీ కాదు అని కామెంట్ చేశారు. సౌత్ ఇండియా రేంజ్ చిత్రాలు తెరకెక్కించే సత్తా బాలీవుడ్ దర్శకులకు లేదని కాంతార చిత్రం ద్వారా కంగనా ఎద్దేవా చేసింది.
హిందీలో కాంతార చెప్పుకోదగ్గ ప్రభావం చూపుతుంది. అక్కడ కనీస ప్రమోషన్స్ నిర్వహించలేదు. అయినప్పటికీ వర్డ్ ఆఫ్ మౌత్ బాగా పనిచేస్తుంది. ఫస్ట్ వీక్ ముగిసే నాటికి కాంతార రూ. 15 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకుంది. తెలుగులో ఈ చిత్రం రికార్డు వసూళ్లు సాధిస్తుంది. ఆరు రోజులకు కాంతార ఏపీ/తెలంగాణా కలిపి రూ.10.6 కోట్ల షేర్ రాబట్టింది. వర్కింగ్ డేస్ లో కూడా కాంతార వసూళ్లు సాలిడ్ గా ఉన్నాయి.

కాంతార చిత్ర తెలుగు హక్కులు నిర్మాత అల్లు అరవింద్ కేవలం రూ. 2 కోట్లకు కొన్నారు. అంటే వారం ముగియకుండానే కాంతార రూ. 8 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది. నేడు విడుదలైన కొత్త చిత్రాలకు మించి బుకింగ్స్ కాంతార నమోదు చేస్తుంది. ఈ వారం కూడా కాంతార చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించడం ఖాయం. రన్ ముగిసే నాటికి కాంతార రికార్డు నెంబర్ క్రియేట్ చేస్తుంది. కెజిఎఫ్ 2, విక్రమ్ తర్వాత ఈ ఏడాది కాంతార భారీ ఆదరణ దక్కించుకున్న తెలుగు చిత్రంగా నిలిచింది.