kangana Ranaut: ‘అన్నీ తెలిసినమ్మ అమావాస్య నాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశి నాడు చచ్చిందట’.. కంగనా రనౌత్ వ్యవహారం ఇలాగే ఉంది. కొమ్ములు తిరిగిన స్టార్ హీరోలు కూడా, తన హమ్మింగ్ ముందు దిగదుడుపే అని ఇన్నాళ్లు లేనిపోని గొప్పలకు పోయింది. చివరకు ఆస్తి మూరెడు ఆశ బారెడు అన్న చందాన మిగిలిపోయింది. ఇన్నేళ్లు ‘బాక్సాఫీస్ క్వీన్’ అంటూ స్టార్ డమ్ ఎంజాయ్ చేసింది కంగనా రనౌత్. కానీ, ఆమె నటించిన ‘ధాకడ్’ సినిమా కలెక్షన్లు చూసాకా, ఇక ఆమెకు ఆ బిరుదు సరిపోదు అని వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా ‘ధాకడ్’కి కలెక్షన్లు చాలా దారుణంగా వచ్చాయి. ఎనిమిదో రోజున కేవలం ₹4,420 మాత్రమే వచ్చాయి. దేశవ్యాప్తంగా కేవలం 20 టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఓవరాల్ గా, ధాకడ్ చిత్రం ఇప్పటివరకు దాదాపు ₹3 కోట్లు కలెక్ట్ చేసింది.
ఐతే, ‘ధాకడ్’ చిత్రానికి ₹80 కోట్ల నుండి ₹90 కోట్ల వరకు ఖర్చు అయ్యింది. ఈ లెక్కలను బట్టి.. ఈ నాలుగైదు దశాబ్దాల్లోనే ఈ రేంజ్ ప్లాప్ మరో సినిమాకి దక్కలేదు. రజనీష్ ఘై దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, దివ్య దత్తా కూడా నటించారు. నిజానికి రజనీష్ ఘై మంచి విషయం ఉన్న దర్శకుడే. మరి.. కంగనా పైత్యం ప్రభావమో ఏమో తెలియదు గానీ.. బాలీవుడ్ కి డిజాస్టర్ల అమ్మ మొగుడు లాంటి సినిమాని అదించాడు. పైగా చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకున్నట్లు.. కంగనా పేరు చెప్పి ఈ సినిమాని భారీ రేట్లకు అమ్మారు. బయ్యర్లను అడ్డంగా ముంచారు. పోస్టర్ల డబ్బులు కూడా వెనక్కి రాలేదు.
Also Read: Nandamuri Hero In Mahesh Movie: మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో విలన్ గా నందమూరి హీరో.. షాక్ లో ఫాన్స్
భారతీయ సినీ చరిత్రలోనే భారీ నష్టాలను మిగిల్చిన సినిమాగా, ఈ చిత్రం చరిత్ర పుటల్లోకి సగర్వంగా ఎక్కింది. నిజానికి ఈ రికార్డు మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’ పేరిట ఉండేది. కానీ, కంగనా సినిమా, మోహన్ బాబు సినిమా కంటే డిజాస్టర్ గా నిలవడం విశేషం. ఎవ్వరూ ఊహించని విధంగా ‘ధాకడ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఓపెనింగ్స్ పరంగా కూడా బాగా నిరాశ పరిచింది. చాలా చోట్ల జనాలు లేక షోలు క్యాన్సిల్ అయ్యాయి. పైగా షోలు పడిన చోట ఆక్యుపెన్సీ కేవలం 0-05% వరకు మాత్రమే ఉంది. ఇది కంగనా సినీ కెరీర్ కే అవమానం. మరీ ఇంత దారుణమా! అసలు దేశమంతా కలిపి ఇరవై టికెట్లు ఏమిటి ?, అందుకే అంటారు.. కాలితో నడిస్తే కాశీకి కూడా పోవచ్చు గాని, తలతో నడిస్తే తన వాకిలి దాటలేదు అని. ఇప్పటికైనా కంగనా తన తల బిరుసు తగ్గించుకుంటే మరో నాలుగేళ్లు లైఫ్ ఉంటుంది. కాబట్టి.. కంగనా ఆలోచించుకో.
Also Read: Sarkaru Vaari Paata OTT Update: సర్కారు వారి పాట OTT రిలీజ్ డేట్ వచ్చేసింది