Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Planned A Special Show For Pavan Kalyan: పవన్ కళ్యాణ్ కోసం...

Mahesh Babu Planned A Special Show For Pavan Kalyan: పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక షో ప్లాన్ చేసిన మహేష్ బాబు.. కానీ..!

Mahesh Babu Planned A Special Show For Pavan Kalyan: మన టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కి యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వీళ్ళ సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది..అలాంటి ఇమేజి ఉన్న వీళ్లిద్దరి ఫాన్స్ మధ్య సోషల్ మీడియా లో ఎప్పుడు ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉండే సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఇద్దరు హీరోల అభిమానులు మధ్య ఎన్ని గొడవలు ఉన్నా కూడా హీరోలిద్దరు మాత్రం ఒక్కరినొక్కరు ఎంతో గౌరవించుకుంటూ ఉంటారు..బయట ప్రపంచానికి వీళ్లిద్దరి మాట్లాడుతుంటారు అనే విషయం తెలీదు కానీ, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్త మిత్రులలో ఒక్కరు మహేష్ బాబు..మహేష్ సతీమణి నమ్రత కూడా పవన్ కళ్యాణ్ కుటుంబం కి మంచి సన్నిహితురాలే..ఇటీవల కాలం లో అందరూ హీరోలు కలిసిన సందర్భాలు..మరియు ఫోటోలు దిగిన సంఘటనలు ఉన్నాయి కానీ..పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కలిసి ఇటీవల కాలం లో ఒక్కసారి కూడా కలిసి ఫోటో దిగిన సందర్భం లేదు.

Mahesh Babu Planned A Special Show For Pavan Kalyan
Pavan Kalyan, Mahesh Babu

Also Read: Sarkaru Vaari Paata OTT Update: సర్కారు వారి పాట OTT రిలీజ్ డేట్ వచ్చేసింది

వీళ్లిద్దరు కలిసి ఒక్కే చోట కనిపిస్తే చూడాలని ఉంది అనే కోరిక తో లక్షలాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు..వారి ఎదురు చూపులకు అతి త్వరలోనే తెర పడనుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ఒక్క వార్త ఇరువురి హీరోల అభిమానులను కేరింతలు కొట్టేలా చేస్తుంది..అసలు విషయానికి వస్తే మహేష్ బాబు నిర్మాతగా మేజర్ అనే సినిమాని నిర్మించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాలో అడవి శేష్ హీరో గా నటించాడు..మిలటరీ మేజర్ ఉన్నిముకుందన్ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం భాషల్లో వచ్చే నెల 3 వ తారీఖున విడుదల కానుంది..అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని మహేష్ బాబు కి ఎంతో దగ్గర అయినా వారందరికీ ప్రత్యేకమైన షో ని ఏర్పాటు చేస్తున్నారు అట..దీనికి పవన్ కళ్యాణ్ కి కూడా ప్రత్యేక ఆహ్వానం మహేష్ మరియు నమ్రత గారి నుండి వెళ్లినట్టు తెలుస్తుంది..పవన్ కళ్యాణ్ కనుక ఈ ప్రివ్యూ షో కి వస్తే మహేష్ – పవన్ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియా మొత్తం రాజ్యం చక్కర్లు కొట్టేస్తాది..చూడాలి మరి ఆ అరుదైన సంఘటన ఈసారి అయినా చోటు చేసుకుంటుందో లేదో అనేది.

Also Read: RCB loses IPL Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో ఆర్సీబీ ఓటమి.. రన్ మిషన్ కోహ్లీపై ట్రోల్స్
Recommended Videos:
ఎన్టీఆర్ నట విశ్వరూపానికి  నిదర్శనాలు ఇవే || Sr NTR Birthday Special Video || NTR Satha Jayanthi
ఎఫ్ 3 మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ || F3 Movie First Day Collections || Ok Telugu Entertainment

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version