https://oktelugu.com/

Kangana: సిక్కు వివాదం కేసులో ముంబయి పోలీస్​ స్టేషన్​కు కంగనా

Kangana: ఎప్పుడూ వివాదాల్లో హాట్​టాపిక్​గా నిలుస్తుంటుంది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్​. ఈ క్రమంలోనే సిక్కు వివాదంలో ముంబయి పోలీసుల ఎదుట హాజరు కానుంది. తన స్టేట్మెంట్​ను నమోదు చేసేందుకు బుధవారమే కంగనా ముంబయి ఖార్​ పోలీస్​ స్టేషన్​కు వెళ్లాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడిదింది. ఈ క్రమంలోనే ఈ రోజు తన స్టేట్మెంట్​ను రికార్డు చేసేందుకు పోలీసు స్టేషన్​ను చేరుకోనున్నట్లు సమాచారం. కంగనా తరచూ ఏదో అంశంపై స్పందిస్తూ.. వివాదాలను మూటగట్టుకోవడం సాధారణమైపోయింది. […]

Written By: , Updated On : December 23, 2021 / 11:01 AM IST
Follow us on

Kangana: ఎప్పుడూ వివాదాల్లో హాట్​టాపిక్​గా నిలుస్తుంటుంది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్​. ఈ క్రమంలోనే సిక్కు వివాదంలో ముంబయి పోలీసుల ఎదుట హాజరు కానుంది. తన స్టేట్మెంట్​ను నమోదు చేసేందుకు బుధవారమే కంగనా ముంబయి ఖార్​ పోలీస్​ స్టేషన్​కు వెళ్లాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడిదింది. ఈ క్రమంలోనే ఈ రోజు తన స్టేట్మెంట్​ను రికార్డు చేసేందుకు పోలీసు స్టేషన్​ను చేరుకోనున్నట్లు సమాచారం.

kangana-may-appear-before-mumai-police-today-on-sikh-controversy

కంగనా తరచూ ఏదో అంశంపై స్పందిస్తూ.. వివాదాలను మూటగట్టుకోవడం సాధారణమైపోయింది. గతంలో ఇటువంటి కేసులు చాలానే కంగనపై నమోదయ్యాయి. ఇప్పటికీ కొన్ని కేసులు పెండింగ్​లోనే ఉన్నాయి. కాగా, కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని వేర్పాటువాదులతో పోలుస్తూ.. సిక్కు సంఘంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది కంగనా. దీంతో సిక్కు సంస్థ ఆగ్రహానికి గురై.. కంగనపై కేసు పెట్టారు. ఈ క్రమంలోనే కంగనా ముంబయి పోలీసుల ఎదుట హాజరు కానుంది.

అయితే, ఇటీవలే ఈ వ్యవసాయ బిల్లును రద్దు చేస్తూ కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై రైతులతో పాటు, దేశమంతటా సంతోషం వ్యక్తం చేయగా.. కంగనా మాత్రం బీజేపీపై ట్వీట్లతో విరుచుకుపడింది. అసలు ఇదేం పాలనంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కంగనకు ఈ వివాదాలు కొత్తేం కాదు, గతంలో పలు రాజకీయ, సామాజిక, సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ.. వివాదాల్లో నిలిచింది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు దారి తీస్తుందో తెలియాల్సి ఉంది.