https://oktelugu.com/

Kangana Chukkeduru : కంగనాకు చుక్కెదురు.. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ కు ముందే ఇలాంటి చేదు వార్త?

కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ సినిమా వస్తుందంటే థియేటర్ లలో చూడటానికి ఎదురుచూసే డై హాట్ అభిమానులు ఎంతో మంది ఉన్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 15, 2025 / 12:53 PM IST

    Kangana Chukkeduru

    Follow us on

    Kangana Chukkeduru :  కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ సినిమా వస్తుందంటే థియేటర్ లలో చూడటానికి ఎదురుచూసే డై హాట్ అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇక ఈ బ్యూటీ నటి మాత్రమే కాదు దర్శకురాలు కూడా. ఇక ఈమె దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం బంగ్లాదేశ్‌లో నిషేధించారు. సినిమా విడుదలకు ముందే ఇలా జరగడం షాక్ అనే చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పొరుగు దేశం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ భారతదేశంలో ప్రకటించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ‘ఎమర్జెన్సీ’ సినిమా తెరకెక్కింది.

    అయితే ‘బంగ్లాదేశ్‌లో ‘ఎమర్జెన్సీ’ ప్రదర్శనను నిలిపివేయాలనే నిర్ణయం భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుత ఉద్రిక్త సంబంధాలకు సంబంధించినది. సినిమా ఇతివృత్తం కారణంగా ఈ నిషేధం విధించారట. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తత కారణంగా దీన్ని నిషేధించారు అని సమాచారం. కారణాలు ఏమైనా సరే కంగనా రనౌత్ కు మాత్రం ఇది చేదు వార్త అని చెప్పాలి.

    ‘ఎమర్జెన్సీ’ 1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర్య యుద్ధంలో భారత సైన్యం, ఇందిరా గాంధీ ప్రభుత్వం పాత్రను, ‘బంగ్లాదేశ్ పితామహుడు గా పిలిచే షేక్ ముజిబుర్ రెహమాన్‌కు అందించిన మద్దతును కూడా తెలుపుతుంది. అయితే ఈ సినిమా బంగ్లాదేశ్ తీవ్రవాదుల చేతిలో ముజిబుర్ రెహమాన్ హత్యను కూడా తెలియజేస్తుందట. దీని కారణంగా బంగ్లాదేశ్‌లో ఈ చిత్రం నిషేధించారు అని సమాచారం. అయితే మరో రెండు రోజుల్లో భారతీయ థియేటర్లలో ‘ఎమర్జెన్సీ’ విడుదలకు సిద్ధం అయింది. ఇక ఈ సినిమా జనవరి 17న విడుదల కానుంది. ఈ ‘ఎమర్జెన్సీ సినిమా భారతీయ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని వివరిస్తుంది.

    ఈ సినిమాలపై నిషేధం కూడా విధించారు
    పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో నిషేధం ఎదుర్కొంటున్న భారతీయ చిత్రాల జాబితాలో ‘ఎమర్జెన్సీ’ ఒక్కటే కాదు మరికొన్ని సినిమాలు కూడా నిషేధంలోనే ఉన్నాయి. గతంలో ‘పుష్ప 2’, ‘భూల్ భూలయ్యా 3’ వంటి చిత్రాలు బంగ్లాదేశ్‌లో విడుదల కాకుండా నిలిపివేశారు. ఇందులో పుష్ప 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా తన రేంజ్ ను చాటుకుంది. బాక్సాఫీస్ కలెక్షన్లను బద్దలు కొట్టిన ఈ సినిమాను కూడా అక్కడ నిషేధించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం కంగనా నిరంతరం ముఖ్యాంశాల్లో కూడా నిలిచింది. రోజూ ఏదో ఒక ప్రకటన ఇస్తూనే ఉంది. దీంతో పాటు కొద్ది రోజుల క్రితం అనుపమ్ ఖేర్ ఇంటికి కూడా వెళ్లి అతని తల్లిని కలిసింది. ఇక నిన్న పండుగ శుభాకాంక్షలు కూడా తెలిపింది ఈ బ్యూటీ. మరి చూడాలి మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందిస్తుందో..